YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

బహిర్గతమైన ఢిల్లీలోని ‘నిజాముద్దీన్‌’ తబ్లీగ్ కార్యకలాపాలపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ నివేదిక

   బహిర్గతమైన ఢిల్లీలోని ‘నిజాముద్దీన్‌’ తబ్లీగ్ కార్యకలాపాలపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ నివేదిక

 

 

  బహిర్గతమైన ఢిల్లీలోని ‘నిజాముద్దీన్‌’ తబ్లీగ్ కార్యకలాపాలపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ నివేదిక

హోంమంత్రిత్వశాఖ ఆశ్చర్యకర రహస్య నివేదికను రూపొందించింది. 1203 మంది తబ్లిగ్ జమాత్ కార్యకర్తలను పరీక్షించగా వారిలో 303 మందిక కరోనా లక్షణాలున్నాయని తేలడంతో వారందరినీ ఢిల్లీలోని నరేలా, బక్కర్ వాలా, సుల్తాన్ పురి ప్రాంతాల్లోని నిర్బంధ కేంద్రాలకు తరలించారు. ఢిల్లీలోని ‘నిజాముద్దీన్‌’ ప్రధాన కేంద్రంగా తబ్లీగ్‌-ఎ-జమాత్‌ అనే సంస్థ నిర్వహించిన సమావేశాల సందర్భంగా వీటి కార్యకలాపాల్లో పాల్గొనేందుకు   ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల నుంచి పెద్దసంఖ్యలో ఢిల్లీలో హజ్రత్ నిజాముద్దీన్ లోని బంగ్లేవాలీ మసీదు వద్ద ఉన్న తబ్లిగ్ మర్కాజ్ వద్దకు వచ్చారని హోంశాఖ అధికారుల దర్యాప్తులో తేలింది ఈ ఏడాది జనవరి 1వతేదీ నుంచి ఇప్పటివరకు మొత్తం 2100 మంది విదేశీయులు పాల్గొన్నారని వెల్లడైంది. మార్చి నెలలో జరిగిన సమావేశాలే కాకుండా ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా వివిధ మసీదులు కేంద్రాలుగా తబ్లిగ్ జమాత్ కు చెందిన దేశ, విదేశీ కార్యకర్తలు ఛిల్లా పేరిట బోధనల్లో పాల్గొంటారని హోంమంత్రిత్వశాఖ తన నివేదికలో వెల్లడించింది. విదేశీయులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని రాష్ట్ర అమీర్ ల పర్యవేక్షణలో మసీదుల్లో చిల్లా కార్యక్రమాలు చేపట్టారని బయటపడింది. మార్చి 21 వతేదీ నాటికి హజ్రత్ నిజాముద్దీన్ మర్కాజ్ లో 1746 మంది ఉండగా వీరిలో 216 మంది విదేశీయులు, 1530 మంది భారతీయులున్నారు. వీరితోపాటు మరో 824 మంది విదేశీయులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిల్లా కార్యక్రమాల్లో ఉన్నారని హోంశాఖ తన నివేదికలో వివరించింది. 

   

Related Posts