YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎరక్కపోయి..ఇరుక్కుపోయిన బీద

ఎరక్కపోయి..ఇరుక్కుపోయిన బీద

ఎరక్కపోయి..ఇరుక్కుపోయిన బీద
నెల్లూరు, ఏప్రిల్ 1
బీద మస్తాన్ రావు.. తెలుగుదేశం పార్టీలో కీలక నేత. ఆయన నెల్లూరు జిల్లాకే పరిమితమైన నేత అయినప్పటికీ పార్టీని ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకున్న నేత. అందుకే చంద్రబాబు సయితం బీద సోదరులకు మంచి ప్రయారిటీ ఇచ్చారు. బీద రవించంద్రకు ఎమ్మెల్సీ ిఇచ్చారు. గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు టిక్కెట్ ను కూడా ఆ కుటుంబానికే ఇచ్చారు. అయితే బీద మస్తాన్ రావు ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఇది టీడీపీకి కూడా ఊహించని పరిణామం. చంద్రబాబు సయితం విస్మయం చెందారు. సోదరుడు బీద రవిచంద్ర టీడీపీలోనే కొనసాగుతున్నప్పటికీ మస్తాన్ రావు పార్టీని వీడటం పెద్ద దెబ్బే. ప్రధానంగా నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో బీద సోదరులకు పట్టు ఉండటం, బలమైన బీసీ సామాజిక వర్గం నేత కావడంతో చంద్రబాబు చివరి నిమిషం వరకూ మస్తాన్ రావును ఆపేందుకు ప్రయత్నించారు. అయినా బీద మస్తాన్ రావు మాత్రం పార్టీని వీడి వైసీపీలో చేరిపోయారు.ఇక వైసీపీలో బీద మస్తాన్ రావు చేరడానికి కూడా ప్రత్యేక కారణం ఉందన్న ప్రచారం ఉంది. అధికారంలో ఉండటమే కాకుండా తనకు రాజ్యసభ పదవి ఇస్తానని హామీ రావడంతోనే బీద మస్తాన్ రావు వైసీపీలో చేరారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్ నుంచే హామీ రావడం, విజయసాయిరెడ్డి కూడా ప్రామిస్ చేయడంతోనే బీద మస్తాన్ రావు వైసీపీలో చేరారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ బీద మస్తాన్ రావును పక్కన పెట్టింది.బీద మస్తాన్ రావుకు ఈదఫా రాజ్యసభ స్థానం దక్కకపోవడానికి మూడు కారణాలున్నాయం టున్నారు. ఒకటి ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులున్నారు. అంతేకాకుండా ఇప్పుడు భర్తీ చేస్తున్న స్థానాల్లో కూడా మోపిిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ బీసీలు కావడంతో మరో బీసీకి ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇక మూడో బలమైన కారణం ఊహించని విధంగా జగన్ రాజ్యసభ పదవిని నత్వానికి ఇవ్వడం. నత్వాని ఇక్కడకు రాకుంటే బీద మస్తాన్ రావుకు దక్కేదన్నది వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్న విషయం. మొత్తం మీద బీద మస్తాన్ రావుకు పదవి దక్కకపోవడానికి మూడు కారణాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
 

Related Posts