YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కరోనా సేఫ్టీ మెధడ్స్

కరోనా సేఫ్టీ మెధడ్స్

కరోనా సేఫ్టీ మెధడ్స్
హైద్రాబాద్, ఏప్రిల్ 1
కరోనా అనే రక్కసి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. దీని భారిన పడిన  ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో  రాలిపోతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి డాక్టర్లు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతీ ఒక్కరు తుమ్మినపుడు, దగ్గినపుడు చేయిని, కర్చీఫ్ ను అడ్డం పెట్టుకుంటున్నారు. అయితే చేతులకు అంటిన వైరస్ కళ్లు, ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీంతో సదరు వ్యక్తి వ్యాధిగ్రస్తుడవుతున్నాడు. రోగం బయటపడటానికి 18 నుంచి 20 రోజులు పడుతుంది కావున ఈ మధ్య తెలియకుండానే వేరే వారికి వైరస్ అంటుకుంటుంది. అయితే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు డాక్టర్లు పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా మన చేతులను ముఖానికి తాకకుండా చూసుకోవాలని చెప్తున్నారు.సాధారణంగా ప్రతీ మనిషి తన చేతిని రోజులో 9 నుంచి 23 సార్లు ముఖానికి తాకిస్తాడని చెప్తున్నారు డాక్టర్లు.  ఆత్రుత, ఇబ్బంది, ఒత్తిడి, దురద ఉన్నప్పుడు కళ్లు తుడుచుకోవడం, నలుపుకోవడం, గోర్లు కొరుక్కోవడం, జుట్టు సవరించుకోవడం చేస్తుంటారని చెప్తున్నారు. అయితే ఈ అలవాట్లే కరోనా వైరస్ వ్యాప్తి అయ్యేలా చేస్తున్నాయని అంటున్నారు. మనకు తెలువకుండా మనం ఈ అలవాట్లకు లోనయ్యామని వీటి నుంచి బయటపడాలని సూచిస్తున్నారు.ఈ అలవాట్లను మానేయాలంటే ముందుగా ఏయే సమయాల్లో చేతిని ముఖానికి తాకిస్తున్నామో గుర్తించాలని చెప్తున్నారు డాక్టర్లు. వాటన్నింటిని ఒక పేపర్ మీద రాసుకుని ప్రతీ రోజు క్రమం తప్పకుండా ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఇలా చేయండి…తుమ్ము వచ్చినపుడు చేయిని అడ్డు పెట్టకుండా మోచేతిని వాడాలని సూచిస్తున్నారు. దీంతో వైరస్ సోకే ప్రసక్తి లేదని చెప్తున్నారు డాక్టర్లు.ముఖాన్ని తాకాల్సి వచ్చినపుడు కర్చీఫ్ ను వాడాలని, ఏదైనా ఎలర్జీ లాంటి వ్యాధితో బాధపడుతుంటే తక్షణం డాక్టర్ ను సంప్రదించాలని చెప్తున్నారు. ప్రతీసారి తల వెంట్రుకలను సరిచేసుకోకూడదని… హేర్ బ్యాండ్ ను వాడాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లినపుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెప్తున్నారు.

Related Posts