YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 బ్లాక్ లో యదేచ్ఛగా మద్యం

 బ్లాక్ లో యదేచ్ఛగా మద్యం

 బ్లాక్ లో యదేచ్ఛగా మద్యం
నిజామాబాద్, ఏప్రిల్ 1
లాక్‌డౌన్‌ పీరియడ్‌లో మద్యం వ్యాపారుల దోపిడీకి అంతులేకుండా పోయింది. మద్యం ప్రియుల బలహీనతను సొమ్ముగా మార్చుకుంటున్నారు. వైన్స్‌ షాపులు, బార్లలోని మొత్తం స్టాక్‌ను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించారు. ఎమ్మారీ్పకి నాలుగింతల రేట్లకు మద్యం బాటిళ్లను అమ్ముతున్నారు. మద్యం తాగటం బలహీనతగా మారిన కొందరు గత్యంతరం లేని స్థితిలో కొనుగోలు చేస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. వారం రోజులుగా ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలు గుట్టుచప్పుడు సాగుతున్నాయి. ప్రధానంగా నిజామాబాద్‌ నగరంలో మద్యం వ్యాపారుల ఇష్టారాజ్యం మారింది. ఇప్పుడిది  అంతటా హాట్‌ టాపిక్‌గా మారింది.
మద్యం బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముడవుతుంటే మరోవైపు ఎక్సైజ్‌శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. మద్యం అక్రమంగా విక్రయిస్తే పట్టుకొని కేసులు నమోదు చేయాల్సిన వారే అక్కమార్కులకు అండగా ఉంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మరో వైపు కల్తీకల్లు విజృంభిస్తోంది. నగరంలో, జిల్లాలో కల్లు డిపోలు , కల్లు దుకాణాలు ఎక్కడికక్కడ మూతపడిన విషయం తెలిసిందే. అయితే కల్లు విషయంలో సైతం రూ.10 నుండి 20 లోపు ఉండే సీసా ధర ఇప్పుడు ఏకంగా రూ.50 పైనే విక్రయాలు జరుపుతున్నారు ఎర్రగడ్డకు క్యూ కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో కేవలం నిత్యావసరాలకు సంబంధించిన షాప్‌లు తప్ప మిగతా షాప్‌లు మూత పడ్డాయి. వైన్‌ షాప్‌లు కూడా మూతపడటంతో మందుబాబులు పరిస్థితి దారుణంగా తయారైంది. రోజు మద్యం సేవించడం అలవాటు ఉన్నవారికి ఒక్కసారిగా మందు దొరక్కపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. మద్యానికి బానిసైన ఒక్కరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.మరోవైపు వారం రోజుల నుంచి మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు వింతగా ప్రవరిస్తున్నారు. దీంతో ఆందోళనకు గురైన మందుబాబుల కుటుంబసభ్యులు.. వారిని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తీసుకువస్తున్నారు. దీంతో ఎర్రగడ్డ ఆస్పత్రికి రోజురోజుకు మందుబాబులు రాక పెరుగుతోంది. కాగా, వింతగా ప్రవరిస్తున్న మందుబాబులకు సంబంధించి రోజుకు వందకు పైగా కేసులు వస్తున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఉమా శంకర్‌ తెలిపారు

Related Posts