YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

 అప్పు ఇప్పిస్తానని అత్యాచారం

 అప్పు ఇప్పిస్తానని అత్యాచారం

 అప్పు ఇప్పిస్తానని అత్యాచారం
ముంబై, ఏప్రిల్ 1
మహిళలపై అఘాయిత్యాలకు ఉరిశిక్షలు విధించినా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. నిత్యం ఎక్కడో చోట మహిళలపై లైంగిక నేరాల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పనిమనిషిపై కన్నేసిన ఓ వడ్డీ వ్యాపారి రుణం ఇప్పిస్తానని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. కారులోనే ఆమెపై అత్యాచారం చేసి రైల్వేస్టేషన్ వద్ద వదిలేసి పారిపోయిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది.ముంబైలోని వడాలా ప్రాంతానికి చెందిన అవివాహితైన మహిళ(29) ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకి సునిల్ గంగారామ్ అలియాస్ రెడ్డి వడ్డీ వ్యాపారి పరిచయమయ్యాడు. రెండేళ్ల కిందట అతని వద్ద రూ.50 వేలు అప్పుగా తీసుకుంది. ఏడాది తర్వాత మరోసారి లక్షకు పైగా అప్పు చేసింది. అందుకు తన ఇంటి పత్రాలతో పాటు బ్యాంకు చెక్కులు, తన ఆధార్ కార్డు తదితరాలను ష్యూరిటీగా పెట్టింది. ప్రతినెలా రూ.20 వేలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. మొత్తం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి చెల్లించేలా గడువు పెట్టుకున్నారు.అయితే ఆమె అప్పు తిరిగి చెల్లించడంలో విఫలమైంది. ఐదు రూపాయల వడ్డీ కావడంతో అప్పు బాగా పెరిగిపోయింది. అసలు, వడ్డీ కలిపి సుమారు రూ.5.7 లక్షలైంది. దీంతో అప్పు తీర్చాలని రెడ్డి కొద్దికాలంగా ఆమెని బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఓ రోజు ఫోన్ చేసి హోటల్‌కి రమ్మని పిలిచాడు. అక్కడికి వెళ్లాక తనకు తెలిసిన క్రెడిట్ సొసైటీ ఉందని.. తన అప్పు తీరుస్తానంటే అప్పు ఇప్పిస్తానని చెప్పాడు.ఆమె సరేననడంతో తన కారులో ఎక్కించుకుని క్రెడిట్ సొసైటీకి తీసుకెళ్లాడు. సొసైటీ సిబ్బంది రెండు లక్షలు లోన్ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అక్కడి నుంచి తిరిగి కారులో బయలుదేరారు. మార్గం మధ్యలో సియోన్ రైల్వే స్టేషన్ దగ్గర వదలిపెడతానని కారు ఎక్కించుకున్న రెడ్డి.. పనిమనిషితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అసభ్యంగా ఎక్కడపడితే అక్కడ తాకుతూ వికృతంగా ప్రవర్తించాడు. అనంతరం కారు ఆపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.అనంతరం సియోన్ రైల్వే స్టేషన్ వద్ద వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిరోజులు మౌనంగా ఉన్న బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. వడ్డీ వ్యాపారి రెడ్డి రుణం ఇప్పిస్తానని తీసుకెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రెడ్డి అలియాస్ సునిల్ గంగారాంని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.

Related Posts