YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

చట్టం మీ చుట్టమా....

చట్టం మీ చుట్టమా....

చట్టం మీ చుట్టమా...( మెదక్)
మెదక్, ఏప్రిల్ 1
వాల్టా చట్టం కొందరికి చుట్టంగా మారిపోయింది. పలువురు అధికారులకు కాసులు కురిపిస్తోంది. నీటి వినియోగం తారాస్థాయికి చేరింది. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ నెపథ్యంలో కొత్త బోర్ల తవ్వకంపై ప్రభుత్వం కట్టడి చేసింది. వాల్టా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయటంలో క్రింది స్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది రెవెన్యూ సిబ్బందే బోర్ల తవ్వకానికి, చెట్ల నరికివేతకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈసారి వర్షాలు కురియకపోవడంతో మనూరు, కంగ్టి, నారాయణఖేడ్‌, పెద్దశంకరంపేట, న్యాల్‌కల్‌ తదితర మండలాల్లోని బోర్లలో నీరు అడుగంటిపోయింది. మంజీర నది ఎండిపోయింది. తాగునీటికి సైతం కష్టంగా మారింది. సాగుచేసిన పంటలు కాపాడుకునేందుకు రైతులు బోర్లు తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత మంది ఇప్పటికే ఉన్న బోర్లను ఫ్లషింగ్‌ చేస్తున్నారు. ఇష్టానుసారంగా, అవగహన లేకుండా బోర్లు తవ్వకం చేయడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. బోరుకు బోరుకు మధ్య 500 మీటర్లు ఉండాలి. భూగర్భ జలమట్టం ఆధారంగా అధికారులు అనుమతులు ఇవ్వాలి. కానీ నిబంధనలు ఎక్కడా అమలు కావడంలేదు. బోర్లు వేసి ఆర్థికంగా చితికి పోరాదన్న ఉద్దేశంతోనే నిబంధనలు విధించారు. ప్రభుత్వం నిబంధనలు విధించినా రైతులు యథేచ్ఛగా బోర్లు తవ్వుతున్నారు. ఒక్కరు కూడా అనుమతి తీసుకోకపోవడం గమనార్హం. మండలంలోని గ్రామాల్లో పదుల సంఖ్యలో నిత్యం బోర్లు వేస్తునే ఉన్నారు. భూగర్భజల శాఖ అనుమతి పొందాకే రిగ్‌ వినియోగించాలన్న నిబంధన పెట్టారు. మొదట భూగర్భజల శాఖ నీరు ఎంత లోతులో ఉందో పరిస్థితి సమీక్షించి అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది నిర్థారిస్తురు. అనుమతి ఇస్తే ఫార్మ్‌-2 తహసీల్దార్‌ ద్వారా తీసుకెళ్లాల్సి ఉంటుంది. రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వెళ్లి పరిశీలిస్తారు. బోరు బోరుకు 500 మీటర్లు ఉంటేనే తవ్వకానికి అనుమతి ఇస్తారు. ట్రాన్స్‌కో అధికారుల ద్వారా విద్యుత్తు సర్వీసు ఇవ్వడానికి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. నీరు పడుతుందని భూగర్భజల శాఖ అధికారులు నిర్థారించాలి. లేదంటే అనుమతి ఇవ్వరూ. ఒక్క బోరుకు అనుమతి తీసుకోలేదు.

Related Posts