YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

నీలినీడలు

నీలినీడలు

నీలినీడలు (విజయనగరం)
విజయనగరం, ఏప్రిల్ 1
జిల్లాలోనే ఏకైక సహకార చక్కెర కర్మాగారం భీమసింగి మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పురాతనమైన యంత్రాలు కావడం...చక్కెర ధర దిగజారిపోవడం, రోజు రోజుకూ పంట విస్తీర్ణం తగ్గుదల... ఆదుకోని ప్రభుత్వం...ఇవన్నీ కలసి కర్మాగార మనుగడపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వచ్చే గానుగ నిర్వహణ కూడా ప్రశ్నార్థ.కం అవుతుండటమే అందరిలోనూ ఇప్పుడు ఆందోళనకు కారణమవుతోంది. భీమసింగి కర్మాగార గానుగ ప్రారంభమై నేటికి 44 సీజన్లు పూర్తి చేసుకున్నా...ఇక్కడ అభివృద్ధి అనేది కంటికి కనిపించనంత దూరంలో ఉంటోంది. జిల్లాలో 14 మండలాలు, విశాఖ జిల్లాలో 4 మండలాల రైతులు దీనిపై ఆధారపడి ఉన్నారు. లెక్కల ప్రకారం 16,873 మంది షేరు హోల్డర్లు ఉన్నా....కేవలం 2000 మందికి మించి చెరకు సరఫరా చేయని పరిస్థితి ఉంది.. కర్మాగారంలో 44 సీజన్లు పూర్తవడంతో పురాతన యంత్రాలతో గానుగకు ఏ ఏడాదికి ఆ ఏడాది ఇబ్బందిగా మారుతోంది. కర్మాగారంలో సెంటి ఫిగర్సు, బాయిలర్‌, జ్యూస్‌ కార్లిపాయిర్‌ పూర్తిగా పాడయ్యాయి. మరమ్మతుకు కూడా వీల్లేని స్థితికి ఇవి చేరుకున్నాయి. వీటిని బాగు చేస్తే గానీ గానుగ నిర్వహించడం కుదరదని కర్మాగార ఇంజినీరింగు విభాగం, సాంకేతిక సిబ్బంది చెబుతున్నారు. దీంతో వచ్చే సీజన్‌ ఓవర్‌ హాలింగ్‌ పనులు కూడా ప్రశ్నార్ధకమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా కర్మాగారంలో కేవలం ఆరుగుర్ని తప్ఫ.. మిగతా అందర్నీ అన్‌ సీజను సాకుగా చూపి వారి సేవల్ని నిలిపివేశారు. కర్మాగారం బాగోగులు చూసే ఎండీకి కూడా వ్యక్తిగత సహాయకుడ్ని లేకుండా చేసేశారు. కర్మాగారం ఆధునికీకరణకు... యంత్ర పరికరాల్ని మార్పు చేసి చెరకు విస్తీర్ణం పెంచడానికి సుమారు 12.5 కోట్లు అవసరమని జాతీయ సహకార సమైక్యకు రుణపరపతికి దరఖాస్తు చేసుకుంటే మంజూరయ్యాయి. రుణ మంజూరుకు అంగీకరించిన జాతీయ సహకార సమైక్య మెలిక పెట్టింది. కర్మాగార ఆర్థిక పరిస్థితి బాగోలేదని రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటే రుణం మంజూరు చేస్తామని తెలియజేసింది. రాష్ట్రంలోని నాలుగు సహకార చక్కెర కర్మాగారాలకు రూ.100 కోట్లు మంజూరుకు గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం.... మొత్తం నగదు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ కూడా చేశారని చెబుతున్నారు. దీన్ని కర్మాగారాలకు రాష్ట్ర చక్కెర కమిషనరు విడుదల చేయాలి. దీంతో ఈ కర్మాగారాలకు మంచి రోజులు వచ్చాయని సంబరపడిన యాజమాన్యాలకు ఎంతో ఎక్కువ కాలం ఆ సంతోషం మిగలలేదు. రాష్ట్ర చక్కెర కమిషనరు చుట్టూ యాజమాన్యాలు సొమ్ముల కోసం తిరుగుతున్నాయి. ఈ రూ.100 కోట్లను ప్రభుత్వం అమ్మఒడికి మళ్లించిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ రుణ పరపతి యాజమాన్యాలకు అందని ద్రాక్షలా ఉండిపోయింది. ముఖ్యమంత్రి కూడా చక్కెర కర్మాగారాలకు మంచి రోజులొచ్చాయని చెబుతుంటే అంతా ఆశ పెట్టుకుంటుంటే పరిస్థితి మరోలా మారుతోంది. భీమసింగి యాజమాన్యం ఇటీవల చెరకు రైతుల చెల్లింపులకు పంచదార బస్తాలు తాకట్టుపై 8 కోట్లు రుణం ఆప్కాబ్‌ నుంచి తీసుకొచ్చింది. ఫిబ్రవరి ఒకటి వరకు చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు రూ.2200, గత సీజన్లో విత్తన బకాయిలు చెల్లించింది. రోజు రోజుకు చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. ఈ ఏడాది 51 వేల టన్నులు మాత్రమే గానుగ ఆడింది. నిజానికి ఈ కర్మాగార సామర్థ్యం 1,65,000 టన్నులు కాగా చాలా సీజన్లులో రెండు లక్షల వరకు గానుగ ఆడిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం రైతులు శ్రద్ధ చూపకపోవడంతో చెరకు ధర గిట్టుబాటు లేకపోవడంతో చాలా మంది రైతులు సాగుపై విముఖత చూపుతున్నారు. వచ్చే సీజన్‌లో 40 వేలు టన్నులకు మించి ఉండదని వ్యవసాయ విభాగమే లెక్కలు వేస్తుండటం గమనార్హం.

Related Posts