YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 కరోనా కట్టడికి పటిష్ట చర్యలు

 కరోనా కట్టడికి పటిష్ట చర్యలు

 కరోనా కట్టడికి పటిష్ట చర్యలు
తాడేపల్లి ఏప్రిల్ 1
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. లాక్ డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి. ప్రభుత్వ సూచనలను అందరూ పాటించాలి. ప్రజలు సామాజిక దూరం తప్పక పాటించాలి.రెండు రోజులు క్రితం వరకు రాష్ట్రంలో 24 పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయని రాష్ర్ట పురపాలకశాఖమంత్రి  బొత్స సత్యనారాయణ అన్నారు.  మూడు రోజులుగా దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరిగాయి. రాష్ర్టంలో ఎవ్వరూ  కూడా భోజనంలేదు, ఆకలితో అలమటిస్తున్నారు అనే మాట లేకుండా చూడాలని ముఖ్యమంత్రి  వైయస్ జగన్ స్పష్టంగా చెప్పారు. పేదప్రజలు ఎవరూ ఇబ్బంది పడకూడదనేది ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి  వైయస్ జగన్  పర్సనల్ గా నిత్యం కరోనాపై సమీక్షిస్తూ అదికారులకు సూచనలు ఇస్తున్నారు. ఆరోగ్యశాఖకు నిధులు కొరత లేకుండా చూస్తున్నారు.ఆస్పత్రులలో బెడ్ ల సంఖ్య పెంచుతున్నాం. నియోజకవర్గస్దాయిలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. అనుమానస్పదంగా ఉన్నవారిని,జ్వరంతో బాధపడేవారిని అవసరమైతే క్వారంటైన్ లో పెట్టి చికిత్స అందిస్తున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా రైతుబజార్లు,మొబైల్ రైతుబజార్లను పెంచాలని నిర్ణయించామని అన్నారు. వ్యవసాయసీజన్ కు సంబంధించి రైతులకు పంటలకు సరైన ధరలు లభించేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. పంటలను మధ్దతు ధరలకు రైతులు విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి  వైయస్ జగన్ చెప్పారు. ఇందుకోసం అవసరమైతే మార్కెట్ ఇంటర్ వెన్సన్ స్కీమ్ ప్రకారం కార్యాచరణ రూపొందిస్తున్నారు. టమాటా రైతులు కూడా ఇబ్బందిపడాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. మామిడి రైతులకు ఎగుమతులకు కూడా  ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. బత్తాయి పంటకు సంబంధించి కూడా ఎదురవుతున్న ఇబ్బందులు ముఖ్యమంత్రి చర్చించారు.పంట విక్రయాలకు తగు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కరోనా మహమ్మారిని కట్టిడి చేస్తూ ప్రజల దైనందిన జీవితం ముందుకుసాగేలా ప్రభుత్వం పనిచేస్తుంది. రేషన్ కూడా బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం.15 రోజుల వరకు రేషన్ ఇస్తారు.గుంపులు గుంపులుగా రావద్దని కోరుతున్నాం. ఒకే డీలర్ మూడు ప్రాంతాలలో కార్డుదారులకు వారిచెంతనే రేషన్ ఇచ్చేలా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నాం. రేషన్ కార్డు దారులు వేరేచోట రేషన్ తీసుకోవాలన్నా కూడా ఏర్పాటుచేశాం.అదే విధంగా పెన్సన్ అయినా లబ్దిదారులు వేరే చోట ఉన్నా అందిస్తాం. రేషన్ ఇంటింటికి ఇవ్వాలని భావించాం.అయితే కరోనా మహమ్మారి వల్ల అది ఇప్పుడు సాధ్యం కాలేదు.అయితే ఖచ్చితంగా రాబోయే రోజులలో అమలు చేస్తాం. కొందరు విమర్శలు చేస్తున్నారు.ఇది విమర్శలు చేసే సమయం కాదు, పెద్దలు ఆ విషయం గమనించాలి. హైద్రాబాద్ లో కూర్చుని చంద్రబాబు ముఖ్యమంత్రి కి లేఖ రాశారు.ప్రెస్ మీట్ లో కూడా హైద్రాబాద్ నుంచి మాట్లాడారు.అనవసరమైన విమర్శలు చేశారు.ఇది విమర్సలకు సమయం కాదు. వారు మాట్లాడిన మాటలు చూస్తే చాలా దురదృష్టకరం.మేం ఎన్నో పనులు చర్యలు చేస్తన్నా ప్రచారంలో మేం వెనకబడిఉన్నమాట వాస్తవం. మేం తీసుకున్న నిర్ణయాలవల్ల ప్రజలకు మేలు జరగాలనేదే ముఖ్యమంత్రి  లక్ష్యం.మాకు పబ్లిసిటి అవసరం లేదు. వాస్తవాలే ప్రజలకు చెబుతామని అన్నారు.

Related Posts