గాంధీ ఆసుపత్రికి బర్మా జాతీయుల తరలింపు
నల్గొండ ఏప్రిల్ 1
బర్మా దేశానికి చెందిన పదిహేడు మంది మంది ముస్లింలను నల్లగొండలోని ఒక ప్రార్థన మందిరంలో ఉండగా అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని నార్కట్ పల్లి లోని ఒక ఫంక్షన్ హాల్ లో వైద్య పరీక్షలు చేయగా కరోన లక్షణాలు కనిపించకపోవడంతో వీరిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. వీరు బర్మా దేశస్తులు కాగా మీరు హైదరాబాద్ లోని ప్రార్ధనా మందిరాల్లో మరియు చుట్టుపక్కల నల్లగొండ జిల్లాల కు రావడం జరిగింది. బుధవారం నాడు జరిగిన ఈ ఘటనలో వారికి కరోణ లక్షణాలు లేకపోవడంతో అధికారులు ఊపి రిపీల్చుకున్నారు. అదేవిధంగా ఢిల్లీలోని మర్కజ్ కి వెళ్ళిన నల్గొండ జిల్లాకు చెందిన 42 మందిని కూడా గాంధీ కి తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ విషయంపై డీఎంహెచ్వో కొండల్ రావు మాట్లాడుతూ ఢిల్లీకి వెళ్లిన వారిలో నల్గొండ జిల్లాకు చెందిన 42 మందిని మంగళవారం వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాదుకు తరలించామని అన్నారు. బుధవారం కూడా బర్మా దేశానికి చెందిన వారిని 17 మందిని నల్గొండలో కనుక్కొని వైద్య పరీక్షలు చేసి వారిని కూడా హైదరాబాద్ కు తరలించామని అన్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా రాకపోవడం సంతోషకరమైన విషయం. కరుణ వ్యాప్తి గురించి వైద్య, పోలీసు బృందాలు రాత్రనకా పగలనకా డ్యూటీ లో ఉండి అవగాహన కల్పిస్తున్నారని అన్నారు.