అధిక ధరలకు అమ్మితే కేసులే డీఆర్డీఓ
వ్యాపారులతో మాట్లాడుతున్న డిఆర్డివో శేషాద్రి
లక్షేట్టిపేట ఏప్రిల్ 01
నిత్యావసర సరుకులను అధిక దరలకు అమ్మితే కేసులు తప్పవని డిఆర్డివో శేషాద్రి అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుదవారం కిరాణ వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో వ్యాపారులు అధిక దరలకు అమ్మకాలు జరుపుతున్నారని ట్విట్టర్ లో పోస్టు చేసారని అలా అమ్మితే కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. వ్యాపారులకు అధికారులు ఒక ధరల పట్టికను అందజేసారు. ప్రతీ ఒక్కరూ అందులో ఉన్న దరలకు మాత్రమే అమ్మకాలు జరుపాలన్నారు. అంతకు ముందు పట్టణ ఎస్పై దత్తాత్రి పట్టణంలోని వ్యాపార సముదాయాలను తనిఖీ చేసారు. అధిక దరలతో పాటు కాలం చెల్లిన వస్తువులను అమ్ముతున్నారని వాదనలు వినిపిస్తున్నాయని అలా జరిగితే షాప్ సీజ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చేర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చేర్మన్ పొడిటి శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ పుష్పలత, సతీష్ కుమార్, మున్సివల్ కమీషనర్ త్రియంబరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది ఉన్నారు.