Highlights
- సిద్దరామయ్య ప్రభుత్వ తీర్మానంపై పలువురి ఆందోళన
- కాంగ్రెస్ కుటిలయత్నాలను సాగనివ్వం:అమిత్ షా
- ఐదో విడత ప్రచారంలో రాహుల్‌గాంధీ
కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపించడంతో కన్నడ రాజకీయాలు క్రమేణా వేడెక్కుతున్నాయి. మంగళవారం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల జాతీయ అధ్యక్షులు ఇరువురు ఒకే ప్రాంతంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో పక్క శివకుమార స్వామీని రాహుల్ గాంధీ కలవటం ద్వారా లింగాయత్ వర్గ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన ఐదో విడత ప్రచారంలో భాగంగా శివమొగ్గలో పర్యటించనున్నారు. సాయంత్రం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ శివమొగ్గ, దవెంగెరె, చిత్రదుర్గ, తుమకురు, రామ్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు కర్ణాటక కాంగ్రెస్ విభాగం వెల్లడించింది. ఇక శివమొగ్గ, దెవెంగరె ప్రాంతాల్లో లింగాయత్ జనాభా అధికంగా ఉంటుంది. చిత్రదుర్గం చల్క్‌ర్ ప్రాంతాల్లో దళిత గిరిజన జనాభా ఎక్కువ. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక ఓట్లను తమ వైపు మళ్లించుకునేందుకు ఆయా ప్రాంతాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పర్యటనలో భాగంగా రాహుల్.. సిద్ధంగంగా మఠాదిపతి శివకుమార స్వామీజి(111) ఆశీర్వాదాలు తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే గత నెల చివర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శివమొగ్గలో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీరశివ-లింగయత్ కమ్యూనిటీపై సిద్దరామయ్య ప్రభుత్వ తీర్మానంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. ఈ ఎన్నికలకు ముందు ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఈ చర్య అన్నారు. అంటే కాకుండా బిఎస్ యడ్యూరప్పని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకెందుకు ఇదొక కుట్ర అన్నారు. కాంగ్రెస్ కుటిలయత్నాలను సాగనివ్వబోమని అమిత్ షా అన్నారు.
Many have expressed concern over Siddaramaiah govt's resolution on Veershaiva-Lingayat community. This is nothing but a conspiracy to mislead people before the elections and stopping BS Yeddyurappa from becoming the CM. We will not let this happen:BJP President Amit Shah (3.3.18) pic.twitter.com/WcSmWARhfg
— ANI (@ANI) April 4, 2018