జీపీఎస్ పద్ధతి ద్వారా క్వారెంటైన్‌లో ఉన్నవారిని ట్రాక్: ఈటెల
హైదరాబాద్ ఏప్రిల్ 1
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 వేల మంది హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. వారందరినీ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. క్వారెంటైన్‌లో ఉన్నవారిని జీపీఎస్ పద్ధతి ద్వారా ట్రాక్ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాన ఆరోగ్యశాఖ సుమారు 25 వేల మందిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నదన్నారు. రియల్‌టైమ్‌లో వారి లొకేషన్‌ను గుర్తిస్తున్నామన్నారు. కోవిడ్19 మానిటరింగ్ వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతున్నదని మంత్రి చెప్పారు.