నిరుపేదలను ఆదుకుంటాం ఏసీపీ రహేమాన్
బెల్లంపల్లి ఏప్రిల్ 01
తాండూరు మండలం ఐబి లో తాండూర్ సిఐ ఉపేందర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ రేషన్ కార్డులు లేని నిరుపేద కుటుంబాలకు 10 కేజీ ల బియ్యం , నిత్యావసర సరుకులను,కూరగాయలను సుమారు 150 నిరుపేద కుటుంబాలకు బెల్లంపల్లి ఏసిపి రహెమాన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఏసీపీ రహెమాన్ మాట్లాడుతూ...కరోన వైరస్ నేపథ్యంలో..లాక్ డౌన్ ను ప్రజలు స్వచ్చందంగా పాటించాలని ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా వ్యాధిని అరికట్టవచ్చని అన్నారు, లాక్ డౌన్ అంటే ఇంటికి లాక్ వేసుకుని బయట తిరగడం కాదని గేటుకు లాక్ వేసుకుని కుటుంబం మొత్తం ఇంట్లో ఉండడం అని ప్రజలు కర్ఫ్యూ ఉన్న రోజుల్లో బయటకి రాకపోవడం మంచిదని సూచించారు, పేద కుటుంబాలను ఆదుకునేందుకు ధనవంతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ బెల్లంపల్లి రహెమాన్, తాండూర్ సిఐ ఉపేందర్, తాండూర్ ఎస్ ఐ శేఖర్ రెడ్డి జడ్పిటిసి బాణయ్య ఎంపీపీ ప్రణయ్, సర్పంచులు అంజిబాబు, ఎంపీటీసీలు దాతలు కోడిప్యాక రంజిత్ కుమార్,పుల్లూరి విగ్నేష్, అభినవ సంతోష్, స్వంచ్ఛంధ సభ్యులు పోలీసు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.