పోలీసులకు కంటి అద్దాలు, గౌజ్ లు, శానిటైజర్స్, మాస్క్ ల పంపిణి
కర్నూలు, ఏప్రిల్ 01 (న్యూస్ పల్స్)
కర్నూలు నగరంలోని పాతబస్టాండ్ కొండారెడ్డి బురుజు దగ్గర 1000 మంది పోలీసులకు కంటి అద్దాలు, గౌజ్ లు, శానిటైజర్స్, మాస్క్ లను పంపిణి చేసే కార్యక్రమం కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి, గ్యాస్ట్రాలజీ డాక్టర్ రామచంద్రనాయుడు 1000 మంది పోలీసులకు కంటి అద్దాలు, గౌజ్ లు, శానిటైజర్స్, మాస్క్ లను పంపిణి చేశారు. ఈ సంధర్బంగా విలేకరులతో మాట్లాడారు. కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ... కరోనా మహామ్మారి అందరిని భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామన్నారు. ఇటువంటి ఆపత్కర సమయంలో బాధ్యతగా తీసుకోని దాతలు ముందుకు రావాలన్నారు. మానవ సేవయే మాధవ సేవన్నారు. అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులను అభినందిస్తున్నామన్నారు. ఎంతో మంది ధనికులు కర్నూలు నగరంలో ఉన్నారని, వారు కూడా ముందుకు వచ్చి సహాకారం అందించాలన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి మాట్లాడుతూ.... కరోనా పోరుపై లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు మాస్కులు, శానిటైజర్స్, గ్లౌజులు, కంటి అద్దాలను తమ వంతుగా సాయం చేయాలని, అనాథలను , పేదవారిని ఆదుకోవాలని దాతలకు పిలుపునిచ్చామన్నారు. ఆ పిలుపు మేరకు మొదటిసారిగా ఎంపీ 5 వేల శానిటైజర్స్ ను పోలీసు సిబ్బందికి పంపిణీ చేయించారన్నారు. నంద్యాల ఎంపి పోచా బ్రహ్మనందరెడ్డి కూడా పోలీసుల సంక్షేమానికి రూ. 20 లక్షలు ఎమ్ పి నిధులను మంజూరు చేశారన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రజా ప్రతినిధులు అండగా నిలిచారన్నారు. జిల్లాలోని అన్ని పట్టణాలలో, గ్రామాలలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. కర్నూలు కొండా రెడ్డి బురుజు దగ్గర ప్రతి రోజూ మధ్యాహ్నం నిత్య అన్నదానం కార్యక్రమం ఉంటుందన్నారు.