YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ప్రపంచ వ్యాప్తంగా 42,322 కు చేరుకున్న కరోనా మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా 42,322 కు చేరుకున్న కరోనా మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా 42,322 కు చేరుకున్న కరోనా మరణాలు
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 1
చాప కింద నీరులా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 42,322కు చేరుకుంది. ఈ వైరస్‌ బారిన 8,59,032 మంది పడ్డారు. కరోనా బారి నుంచి కోలుకున్న వారు 1,78,101. కోలుకున్న వారంతా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ విధించుకున్నాయి.అత్యధికంగా ఇటలీలో 12,428 మంది ఈ వ్యాధితో చనిపోయారు. అక్కడ పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,05792కు చేరుకుంది. అమెరికాలో 4,054 మంది చనిపోగా, 1,88,578 మంది ఈ వైరస్‌తో బాధపడుతున్నారు. స్పెయిన్‌లో 95,923 కేసులు(మృతులు 8,464), జర్మనీలో 71,808 కేసులు(మృతులు 775), ఫ్రాన్స్‌లో 52,128 కేసులు(మృతులు 3,523), ఇరాన్‌లో 44,605 కేసులు(మృతులు 2,898), యూకేలో 25,150 కేసులు(మృతులు 1,789), స్విట్జర్లాండ్‌లో 16,605 కేసులు(మృతులు 433), టర్కీలో 13,531 కేసులు(మృతులు 214), బెల్జియంలో 12,775 కేసులు(మృతులు 705), నెదర్లాండ్స్‌లో కేసులు 12,595(మృతులు 1,039), దక్షిణ కొరియాలో 9,887 కేసులు(మృతులు 165) నమోదు అయ్యాయి.

Related Posts