YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అమెరికాలో బతికే చాన్స్ ఉన్న వారికే చికిత్స

అమెరికాలో బతికే చాన్స్ ఉన్న వారికే చికిత్స

అమెరికాలో బతికే చాన్స్ ఉన్న వారికే చికిత్స
వాషింగ్టన్ ఏప్రిల్ 1 
కరోనా ఎఫెక్ట్ తో అమెరికాలో వైద్యసేవలు కకావికలం అయ్యాయి. కరోనా సోకిన రోగులు పోటెత్తుతుండడంతో బతికే చాన్స్ ఉన్న వారికే చికిత్స చేస్తున్నారు. మిగతా వారిని చావు కోసం వదిలేస్తున్న దయనీయం నెలకొంది. అమెరికాలో దుర్భర స్థితి నెలకొంది. కరోనాతో రోగులు వేల సంఖ్యలో వస్తున్నారు. దీంతో ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోయాయి. వేలమందికి సరిపడా బెడ్స్ - వెంటిలేటర్లు - ఐసీయూలు - ఇతర వైద్య పరికరాలు లేవు.  దీంతో సెలెక్టెడ్ గానే వైద్యులు చికిత్స చేస్తున్న దైన్యం నెలకొంది. ఇటలీ తర్వాత అమెరికాలో సైతం వృద్ధులకు చికిత్స చేయకుండా వదిలేసిన దైన్యం కనిపిస్తోంది.ఆస్తమా - కేన్సర్ - కిడ్సీ సమస్యలు - గుండె సమస్యలు - ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి - స్ట్రీట్ సైడ్ పీపుల్ కు కరోనా సోకితే వారిని వదిలేస్తున్న నిస్సహాయ స్థితి అమెరికాలో దాపురించింది.ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదవుతున్నాయి. ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి. దీంతో రోగులను ప్రాధాన్యత క్రమంలోనే బతికించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఖచ్చితంగా బతుకుతారు అని భరోసా ఉన్న వారికే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి చికిత్స చేస్తున్నారు. ఐసీయూలో పెట్టినా - వెంటిలేటర్ అమర్చినా బతకరు అని భావిస్తున్న కేసులకు బయటే చికిత్స చేస్తున్నారు. వారు చనిపోతున్న స్థితి కనిపిస్తోంది. అమెరికాలో కరోనా రోగులకు 9 లక్షల వెంటిలేటర్లు కావాలి.. కానీ 2.25 లక్షలే ఉండడంతో ఇలా చేస్తున్నారు. న్యూయార్క్ నగరంలో అయితే దుర్భర పరిస్థితి ఉంది. గంటగంటకు రోగుల సంఖ్య పెరుగుతోంది.  60వేలకు పైగా మందికి కరోనా సోకింది. సుమారు వెయ్యి మంది మరణించారు. అమెరికాకు ఆర్థిక రాజధాని న్యూయార్క్ లాక్ డౌన్ తో నిర్బంధం చేయడానికి ట్రంప్ సర్కార్ వెనుకాడుతోంది.ఇక అమెరికాలో ఉన్న తెలుగువారిలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. న్యూయార్క్ లో ఒక తెలుగు యువకుడికి కరోనా సోకింది. అతడు కోలుకున్నాడు.కాలిఫోర్నియాలో వృద్ధ తెలుగు మహిళకు కరోనా సోకి మరణించింది. న్యూయార్క్ లో ఇద్దరు తెలుగు వైద్య దంపతులకు కరోనా సోకిందని..వారు కోలుకుంటున్నారు.

Related Posts