YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

జీతాలివ్వరేం..? (శ్రీకాకుళం)

జీతాలివ్వరేం..? (శ్రీకాకుళం)

 జీతాలివ్వరేం..? (శ్రీకాకుళం)
శ్రీకాకుళం, ఏప్రిల్ 01గత ఏడాది వేసవిలో జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో కార్యాలయ నిర్వహణ, పాఠశాల సంరక్షణ, ఇతర పనుల నిమిత్తం విధులు నిర్వహించాలంటూ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనికి సంబంధించి పాఠశాల కమిషనర్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో పాఠశాల ప్రిన్సిపల్‌ వీరిని విధుల్లోకి తీసుకున్నారు. ఆయా పాఠశాలల పొరుగు సేవల సిబ్బంది ఎన్నో వ్యయ, ప్రయాసలకు ఓర్చి క్రమం తప్పకుండా విధులకు హాజరయ్యారు. కాని ఏడాది అవుతున్నా నేటికీ ఆ జీతాల బకాయిల చెల్లింపులు చేపట్టకపోవడంతో జిల్లాలో ఆయా ఆదర్శ పాఠశాలల్లో పనిచేసిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 14 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. గత ఏడాది వేసవి సెలవుల ప్రారంభం నుంచి జూన్‌ 11 వరకు ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందైన కంప్యూటర్‌ ఆపరేటర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, వాచ్‌మెన్‌, అటెండర్లు విధులకు హాజరయ్యారు. ఒక్కో పాఠశాల నుంచి నలుగురు చొప్పున మొత్తం 56 మంది జిల్లాలో ఈ విధంగా పనిచేశారు. మొత్తం 46 రోజుల పాటు ఈ సిబ్బంది విధులు నిర్వహించారు. అనంతరం పాఠశాల తెరుచుకున్న తరవాత పనిచేసిన కాలానికి జీతాలను మాత్రం అధికారులు చెల్లించారు. కాని వేసవిలో పనిచేసిన కాలానికి బకాయిలు చెల్లించాలని ఆయా విభాగాలను వీరు కోరినప్పటికీ విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదంటూ వారంతా పేర్కొంటున్నారు. ఇంతకు ముందు ఇదేవిధంగా వేసవిలో పనిచేసినప్పుడు జీతాలను చెల్లించారు. కాని 2019లో వేసవిలో పనిచేసిన కాలానికి మాత్రం నేటికీ జీతాలు చెల్లించలేదు. అలాగే ఇతర జిల్లాల్లో కూడా చెల్లింపులు జరిపారు. కాని ఇక్కడ మాత్రం చెల్లించకపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. వేసవిలో పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించాలంటూ కోరిన వారిపై అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. వేసవిలో పనిచేసిన కాలానికి రెన్యువల్‌ లేకపోవడంతో జీతాలు చెల్లించడం లేదంటూ అధికారులు చెబుతున్నారని వారంతా వాపోతున్నారు. దీంతో ఈ జీతాలపై ప్రశ్నించేందుకు చాలా మంది భయపడిపోతున్నారంటూ పలువురు పేర్కొంటున్నారు. ఇదే ఏజెన్సీలో ఇతర శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రం జీతాలు చెల్లించారని, తమకు మాత్రం జీతాలు చెల్లించలేదంటూ వారు పేర్కొంటున్నారు. జిల్లాలో ఈ జీతాల రూపంలో చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ పొరుగు సేవల సిబ్బంది కోరుతున్నారు.
--------------

Related Posts