1997లో తనపై జరిగిన కాల్పుల ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రజా గాయకుడు గద్దర్ హోంమంత్రిని కోరారు. సచివాలయంలో హోంమంత్రి నాయని నర్సింహారెడ్డిని ఈ రోజు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని 2016 డిసెంబర్‌లో అప్పటి రాష్ట్రపతిని కోరినట్టు చెప్పారు. గతంలో ఈ అంశంపై గవర్నర్, ముఖ్యమంత్రి, డీజీపీలకు సైతం పలుమార్లు విజ్ఞప్తి చేశానన్నారు. అయినప్పటికీ, నిందితులను ఇంకా గుర్తించకపోవడంతో తనకు ప్రాణహాని ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, అందువల్ల ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని గద్దర్ కోరారు.