*రామ నవమి పండగ నాడు చేయవలసినవి, చేయకూడనవి.*
రామనవమి అంటే దేశమంతా, పల్లే, పట్నం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చేసుకునే మహా పర్వదినం. హిందువులకు ఇది చాలా ప్రధానమైన పండగ. ఈ పర్వదినాన ప్రతి ఒక్కరు కొన్ని పనులు చేయమంటుంది శాస్త్రం. అలానే కొన్నింటిని చేయవద్దని చెప్తుంది.
1 . సూర్యోదయం పూర్వమే నిద్రలేచి తల స్నానం చేసి, ఇంట్లో సీత రాములవారిని భక్తి, శ్రద్ధలతో పూజించండి.
2. వడపప్పు, పానకం, పాయసం, పొంగలి లాంటి పధార్ధాలతో(శక్తీ కొలది) రామచంద్రప్రభువుకి నివేదన చేసి అందరికి పంచి పెట్టండి.
3. రోజంతా శ్రీరామ నామం స్మరిస్తూ ఉండండి.
4. శక్తి కొలది దాన ధర్మాలు చేయండి. ఎందుకంటే రామనవమి తిథి లాంటి మహా పర్వదినం నాడు చేసే ఏ పుణ్యకర్మయినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.
5. రామనవమి నాడు పగలు ఉపవాసం, రాత్రికి జాగరణ చెయ్యమంటారు పెద్దలు. మీ ఆరోగ్యం సహకరించినంత వరకు ఉపవసించండి, అంటే పాలు, పండ్లు లాంటి సాత్వికమైన ఆహారం తీస్కొని రామనామన్నీ స్మరిస్తూ, వీలయితే రాత్రికి జాగరణ చెయ్యండి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాలైతే నిర్జల ఉపవాసం చేస్తుంటారు.
6. దగ్గర్లోని రామాలయానికి వెళ్లి, భగవద్దర్శనం చేస్కోండి. అవకాశం ఉంటే సీతారాములవారి కల్యాణోత్సవాన్ని కన్నులారా వీక్షించండి. ఎన్నో జన్మల పుణ్యముంటే కానీ సీతారాముల, రుక్మిణీకృష్ణుల కళ్యాణం చూడటం కానీ, చేయించటం కానీ జరగదు. సమస్త జగత్తుకు తల్లితండ్రులైన ఆ అది దంపతుల కల్యాణ వీక్షణ మోక్ష ప్రదం.
7. మాంసాహారం, మందు లాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
8. వీలయితే రామాయణాన్ని పారాయణ కానీ వినడం కానీ చాల గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.
అందరు భక్తిశ్రద్ధలతో రామనవమి ఉత్సవాన్ని జరుపుకొని, రామచంద్ర ప్రభువు చల్లని చూపులు మనందరిమీదా ప్రసరించాలని కోరుకుంటూ.... రామదాసాను దాసుడు
*శ్రీరామ నామ స్మరణం- సమస్త పాపహరణం.*
*శ్రీరామ రక్షా - సర్వ జగద్రక్ష. *
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో