YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

క్షేత్రస్థాయిలో అయోమయం

క్షేత్రస్థాయిలో అయోమయం

క్షేత్రస్థాయిలో అయోమయం
విజయవాడ ఏప్రిల్ 2
కరోనా పెద్ద సమస్య కాదని, జలుబు, జ్వరంతో సమానమని సీఎం జగన్మోహన్ రెడ్డి సెలవిచ్చారు. డబ్ల్యూహెచ్ఓ వంటి ప్రపంచ సంస్థల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వరకు కరోనాను సీరియస్ గా తీసుకోమని హెచ్చరిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ దేశాలు కుదేలైపోతున్నాయ్. మీరేమో చాలా లైట్ తీసుకుంటూ మధ్యాహ్నం ఒంటి గంటవరకు అన్ని పనులు చేసుకోవచ్చంటున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం అయన ట్వీట్టర్ లో వ్యాఖ్యానించారు.  పోలీసులేమో  రోడ్లపైకి వచ్చిన రైతులు, పేదలను, కూలీలను లాఠీలతో బాదుతున్నారు. మీరేం చెబుతున్నారో..క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. ఇంత చిన్న పరిణామం అయినప్పుడు ఉద్యోగులకు సగం జీతాలే ఇచ్చే పరిస్థితికి ఎందుకొచ్చినట్టు. గతంలో మీరు, మీ పార్టీ చంద్రబాబు, కరువు కవల పిల్లలని పాట పాడారు. కానీ మేం కరువొచ్చినా, తుఫాన్లొచ్చినా ఎదుర్కొన్నాం..రైతులకు, ప్రజానీకానికి అండగా నిలిచాం. మా పార్టీ అధికారం చేపట్టినప్పుడు రాజధాని, పరిశ్రమలు, పెట్టుబడులు కోల్పోయినా, విభజన సమస్యలు,  లోటు బడ్జెట్ వెంటాడినా ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. ఒకటో తేదీనే జీతాలిచ్చామని అన్నారు. ఇటు వృద్ధి రేటు కానీ, అటు వ్యవసాయ అనుబంధరంగాల వృద్ధిరేటు కానీ డబుల్ డిజిట్ సాధించాం. అనేక రంగాల్లో దేశంలో అగ్రగామిగా పోటీపడ్డాం. కానీ కరోనా ప్రభావం మొదలైన వారానికే అనుభవం లేక డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయలేక చేతులెత్తేస్తున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదని అన్నారు. ఈరోజు రైతులు, రైతు కూలీలు, వివిధ రంగాలపై ఆధారపడిన వారు సమస్యల్లో కూరుకుపోయారు. సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రీయల్ సెక్టార్ తో పాటు ఆక్వా, అగ్రి, హార్టికల్చర్ తదితర రంగాలు కుదేలయ్యే ప్రమాదముంది. వీటిని అధిగమించేందుకు ఏం చేయాలో సీరియస్ గా ఆలోచించండి.  క్రైసస్ మేనేజ్మెంట్ చేసే అనుభవం లేకపోతే పక్క రాష్ట్రాలను చూసైనా నేర్చుకోండి.  ఏదైనా జరిగితే మీకు, మీ మంత్రులకు ఏం నష్టం రాదు. రాష్ట్ర ప్రజలే నష్టపోతారు.  వెంటనే అఖిలపక్షం పిలిచి అందరి సలహాలు తీసుకోండి. లేదంటే పక్క రాష్ట్రాల సీఎంలను చూసి నేర్చుకోండి.  ఆకలి బాధలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు రాకుండా ప్రజలను కాపాడండి. సమస్యలను అధిగమించేందుకు సమాయత్తంకండి.. ఇప్పటికైనా లైట్ తీసుకోకుండా సీరియస్ గా క్రైసెస్ మేనేజ్మెంట్ చేయండి. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మీమీద ఉందనే విషయం గుర్తుంచుకోండని అయన వ్యాఖ్యానించారు

Related Posts