YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

పుచ్చకాయలను దెబ్బతీసిన కరోనా

పుచ్చకాయలను దెబ్బతీసిన కరోనా

పుచ్చకాయలను దెబ్బతీసిన కరోనా
నల్గొండ, ఏప్రిల్ 2
పుచ్చకాయ పంట చేతికొచ్చి విక్రయించాలనుకున్న సమయంలో కరోనా వైరస్‌ రైతులను దెబ్బ తీసింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో వ్యాపారులు ముందుకు రాకపోవడంతో పాటు వాహనాలూ అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో పొలాల్లో పుచ్చకాయలు కుళ్లిపోతుండటంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 29 మండలాల్లో సుమారు 1325 మంది రైతులు 5600 ఎకరాల్లో పుచ్చకాయ పంట సాగు చేశారు. స్వల్పకాలిక రకాలు 60-70 రోజుల్లో, సాధారణ రకాలు 90 రోజుల్లో కోతకు వస్తాయి. యాజమాన్య పద ్ధతులు పాటించి బిందు సేద్యం, ఫెర్టిగేషన్‌ (డ్రిప్‌ ద్వారా ఎరువుల వాడకం), ప్లాస్టిక్‌ మల్చింగ్‌ లాంటి నూతన సాగు పద్ధతులు అనుసరిస్తే ఎకరాకు 20 టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. ఈలెక్కన 5600 ఎకరాలకు సుమారు లక్ష మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారుల అంచనా. ప్రస్తుతం రవాణా లేక కొనుగోళ్లు నిలిచిపోయి సుమారు 50 వేల మెట్రిక్‌ టన్నుల పంట నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. శివరాత్రి పండుగకు వారం ముందు కోత కొచ్చిన కాయలను రైతులు కిలోకు రూ.10 చొప్పున విక్రయించగా.. రెండు వారాల కింద రూ.7కు, రాష్ట్ర సరిహద్దులు మూతపడటంతో హైదరాబాద్‌ కొత్తపేట మార్కెట్‌, ఆంధ్ర, ఢిల్లీ, చెన్నై, అనంతపూర్‌తో పాటు గుజరాత్‌కు ఎగుమతులు నిలిచిపోయాయి. వ్యాపారులు కూడా ముందుకు రాకపోవడం, రవాణా సౌకర్యమూ లేకపోవడంతో కోతకొచ్చిన కాయలను తోటల్లో వదిలేస్తున్నారు. ఎండలకు కాయలపై మచ్చలు రావడమూ దెబ్బగా మారింది. ఈ పరిణామాల వల్ల రైతులకు పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితివేసవిలో మంచి డిమాండ్‌ ఉంటుందని ఆరెకరాల్లో సాగు చేశాను. గతేడాది కిలోకు రూ.8 నుంచి 10 వరకు ధర పలికింది. ఈసారి లాక్‌డౌన్‌తో కొనేవారు లేక కాతకొచ్చినా తెంపలేదు. ఎండకు పగిలిపోయి రవాణా చేయడానికి సైతం పనికిరాకుండా పోయాయి. కష్టం పోనూ పెట్టుబడి రూ.3.50లక్షలు నష్టం వచ్చింది.ఎకరానికి రూ.50 వేల పెట్టుబడి పెట్టి ఆరెకరాల్లో పుచ్చసాగు చేశాను. ఎకరాకు 15 టన్నుల దిగుబడి వచ్చే విధంగా కోతకొచ్చింది. మార్కెట్‌లో ధర రూ.7 నుంచి రూ.4కు పడిపోయింది. కిలోకు రూ.5 చొప్పున బేరగాడు కొంటానంటే సరేనని ఒప్పుకున్నాను. రెండురోజుల్లో వాహనాలు తీసుకొస్తానని వెళ్లి, లాక్‌డౌన్‌ కారణంగా మార్కెట్‌ లేదని చేతులెత్తేసిండు. పది రోజుల నుంచి కండ్ల ముందే పంట పాడైపోతుంది.

Related Posts