YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 మంగళగిరిలో కరోనా కేసులు

 మంగళగిరిలో కరోనా కేసులు

 మంగళగిరిలో కరోనా కేసులు
గుంటూరు, ఏప్రిల్ 2
ఏపీలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. గత అర్ధరాత్రి 65 ఏళ్ల వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పురపాలక సంఘ కమిషనర్‌ హేమమాలిని తెలిపారు. ఆ వ్యక్తి ఇటీవల ఢిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. అతనితో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. పట్టణంలోని టిప్పర్ల బజార్‌లో ఉన్న కరోనా బాధితుడి నివాసం నుంచి 3కి.మీల పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు కమిషనర్‌ చెప్పారు. కరోనా పాజిటివ్‌ కేసుతో సమీపంలోని దుకాణాలు, కూరగాయల మార్కెట్లను మూసివేయించారు. 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించి ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. ఆ ప్రాంతమంతా హైఅలర్ట్‌ ప్రకటించామని కమిషనర్‌ తెలిపారు.నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం రాత్రి వరకు 44గా ఉన్న కేసుల సంఖ్య ఒక్కసారిగా 111కు చేరుకుంది. రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి.

Related Posts