YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రైతులకు ఆకాల వర్షం బెంగ

రైతులకు ఆకాల వర్షం బెంగ

కొద్ది రోజులుగా జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులకు తోడు వడగళ్లు పడుతున్నాయి. ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులు మొదలవగానే అన్నదాతలను వర్షభయం వెంటాడుతోంది. కంది, శనగ కొనుగోళ్లు ఆగుతూ సాగుతున్నాయి. గోదాముల కొరత, ఆర్థిక సంవత్సరం చివరి రోజులు కావడంతో కొద్ది రోజులు కొన్న పంటను తరలించలేదు. ఇంతలో వివిధ రకాల సెలవులు రావడంతో కొనుగోళ్లు జరపలేదు. సోమవారం కొనుగోళ్లు ఊపందుకున్నా ఇంకా చాలామంది రైతులకు అవకాశం రాకపోవడంతో వర్షం బెంగ పట్టుకుంది. పంట అమ్ముకుని గోదాముకు తరలించేదాకా సాగుదారులదే భారం కావడంతో అన్నదాతలకు రోజుల తరబడి నిరీక్షణ తప్పడంలేదు. జిల్లాలో గోదాముల కొరత ఏర్పడటంతో గుంటూరు  జిల్లా వడ్లమూడికి కొనుగోలు చేసిన పంటను తరలిస్తున్నారు.ఆది, సోమవారాల్లో ఈదురు గాలులతో పాటు చిన్నపాటి జల్లులు కురిశాయి. చుట్టుపక్కల గ్రామాల్లో వడగళ్ల వాన కురిసినా కొనుగోలు కేంద్రం వద్ద కొద్దిపాటి చినుకులతో వర్షం వెళ్లిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ప్లాస్టిక్‌ పట్టాలు తెచ్చుకుని మట్టిపై ఉన్న సంచుల కింద ప్లాస్టిక్‌ పట్టాలు వేసి రక్షణగా కవర్లు కప్పుకొన్నారు. దీనికితోడు చాలా కొనుగోలు కేంద్రాల వద్ద పందుల బెడద వేధిస్తోంది. రాత్రిళ్లు పందులు దాడి చేస్తుండటంతో కునుకు లేకుండా పోయింది. జిల్లావ్యాప్తంగా రైతులది ఇదే పరిస్థితి.జిల్లాలోని చాలా కొనుగోలు కేంద్రాల్లో గుట్టుచప్పుడు కాకుండా చాలా గోప్యంగా రైతుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కాటా వేసిన రైతుల నుంచి రూ.500 నుంచి రూ.రెండు మూడు వేల వరకు వసూలు చేస్తున్నారు. నిబంధ]నల ప్రకారం మార్కింగ్‌ చేయటం, రంగు వేయటం, లోడ్‌ ఎత్తినందుకు రూ.6 మాత్రమే చెల్లించాలి. రైతులు ఇళ్ల వద్దనే జెల్లి పట్టుకుని తీసుకురావాల్సి ఉంది. జల్లెడలు అందుబాటులో లేకపోవడంతో నేరుగా తీసుకొచ్చి నష్టపోతున్నారు. 50 కేజీల బస్తాపై 1,100 గ్రాముల తరుగు తీస్తున్నారు. ఈ లెక్కన క్వింటాపై 2,200 గ్రాముల తరుగు పోతోంది. గోనె సంచి బరువు 600 నుంచి 700 గ్రాములు ఉంటుందని, గోదాముకు చేరేలోపు కొంత ధాన్యం కారిపోవటం ద్వారా తరుగు ఏర్పడుతుందని, అందుకే అదనపు ధాన్యం తీస్తున్నట్లు సిబ్బంది తెలుపుతున్నారు.కొనుగోలు కేంద్రాల వద్ద 50 కేజీల బస్తాపై హమాలీ పట్టిన కూలీ మొత్తం రూ.30 వసూలు చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో దీని ధర ఇంకా ఎక్కువగానే ఉంది. ఈ లెక్కన క్వింటాలుపై రూ.60 వసూలు చేస్తున్నారు. తరుగు రూపంలో బస్తా 51 కేజీలు వేేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో 51 కేజీలు వేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 64,482 హెక్టార్లలో రైతులు కంది సాగు చేశారు. అధికారుల అంచనా ప్రకారం దిగుబడి 40,600 టన్నులు. మార్క్‌ఫెడ్‌, నాఫెడ్‌ ద్వారా 16,700 వేల టన్నుల కొనుగోలుకు అనుమతులు రాగా ఇప్పటిదాకా 21 వేల టన్నులు కొనుగోలు చేశారు. ఇంకా వేలాది టన్నుల పంటతో రైతన్నలు కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిమితి లేకుండా పంటను కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఉన్న 16 కొనుగోలు కేంద్రాలకు అదనంగా వెల్దుర్తి, డోన్‌లలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 18 కేంద్రాల్లో కొంటున్నారు. మద్దతు ధర రూ.5,450. బయటి మార్కెట్‌లో రూ.4 వేల లోపు కొంటున్నారు.జిల్లాలో ఈ ఏడాది 1.87 లక్షల హెక్లార్లలో శనగ పంటను సాగు చేశారు. 1.82 మెట్రిక్‌ టన్నుల దిగుబడిని అధికారులు అంచనా వేశారు. 70 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో 28 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటిదాకా 14 వేల టన్నులు కొనుగోలు చేశారు. శనగ మద్దతు ధర రూ.4,400లుగా ప్రభుత్వం నిర్ణయించింది. బయటి మార్కెట్‌లో రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు కొంటున్నారు.

Related Posts