YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అమెరికాలో 3.5 కోట్ల ఉద్యోగాలు ఫట్

అమెరికాలో 3.5 కోట్ల ఉద్యోగాలు ఫట్

అమెరికాలో 3.5 కోట్ల ఉద్యోగాలు ఫట్
న్యూయార్క్, ఏప్రిల్ 2
కరోనా వైరస్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఈ మహమ్మారి ప్రభావం నుంచి ఎప్పుడు కోలుకుంటుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండడంతో అక్కడ ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం నెలకొంది. ప్రధానంగా హెచ్‌1బీ వీసాపై తాత్కాలికంగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కంపెనీలు ఆర్థికంగా కుంగిపోతుండటంతో తమ ఉద్యోగాలు ఉంటాయా? లేదా? అన్న సందేహం భారతీయుల్లో నెలకొంది.కరోనా వైరస్‌ తీవ్రత తగ్గిన తరువాత అన్ని రంగాల్లో కలిపి సుమారు 3.5 కోట్ల మంది ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీసా నిబంధనల ప్రకారం హెచ్‌1బీ వీసాపై పని చేస్తున్న వారి ఉద్యోగ కాలం తీరిన తరువాత అమెరికాలో 60 రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతి ఉంది. ఆ తరువాత కూడా అక్కడే ఉంటే వారిని అక్రమ వలసదారుగా పరిగణిస్తారు. ఈ పరిస్థితిలో హెచ్‌1బీ వీసాపై అమెరికాలో ఉంటూ ఉపాధి కోల్పోయిన వారు, మరో ఉద్యోగం వెతుక్కునేందుకు లేక మాతృదేశానికి వెళ్లేందుకు ఉన్న గడువును 60 నుంచి 180 రోజులకు పెంచాలనే డిమాండ్‌ పెరుగుతోంది. దీనిపై అమెరికా అధ్యక్షుడికి పంపిన ఆన్‌లైన్‌ పిటిషన్‌పై ఇప్పటికే 80 వేల మంది సంతకాలు చేశారు.ఇతర వీసాలపై అమెరికాలో ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వారిలో చాలా మంది ఇప్పటికే ఉపాధి కోల్పోయారు. అమెరికాలో హెచ్‌1బీ వీసాపై ఉద్యోగం చేస్తూ, వీసా గడువు పొడిగింపు కోసం మాతృదేశం వచ్చిన వారు చాలామంది తిరిగి అక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం భారత్‌ నుంచి అన్ని రకాల వీసా ప్రక్రియల జారీని నిలిపివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఆగిపోయిన హెచ్‌1బీ వీసాదారుల్లో.. అమెరికా వెళ్లాక ఉద్యోగం ఉంటుందా? లేదా? అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.

Related Posts