YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

డ్రింక్ తో వైరస్ కు చెక్...

డ్రింక్ తో వైరస్ కు చెక్...

 డ్రింక్ తో వైరస్ కు చెక్...
బెంగళూర్, ఏప్రిల్ 2,
ప్రకృతిలో శీతాకాలం, వసంతకాలం ఇలా మారుతూ ఉంటాయి. కొన్నికాలాలు మార్పు మరియు ఆ వాతావరణాన్ని మనం ఆస్వాదిస్తూ... సంతోషిస్తాము, కాని కాలానుగుణ మార్పు అనేక రకాల వ్యాధులను తెస్తుంది, దీనివల్ల అనేక మంది అనారోగ్యానికి గురౌతుంటారు. దీని వల్ల జ్వరం, దగ్గు జలుబు మరియు చికెన్ పాక్స్ లాంటివి వస్తుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, చికెన్ పాక్స్ ని వరిసెల్లా అని కూడా పిలుస్తారు, ఇది తీవ్రమైన అంటు వ్యాధి. ఇది వరిసెల్లా-జోస్టర్ వైరస్ (VZV) తో ప్రాధమిక సంక్రమణ వలన సంభవిస్తుంది. ఈ సమయంలో ప్రజలు వారి ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఏంతో ఉందని హెల్త్ ప్రాక్టీషనర్, న్యూట్రిషనిస్ట్ శిల్పా అరోరా తెలిపారు. "రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం వల్ల కాలానుగుణ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని వివరించారు .అయితే " విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయల తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు . శిల్పా అరోరా చాలా సులభమైన మరియు ఆరోగ్యకరమైన పానీయం రెసిపీని పంచుకునారు. అది మిమ్మల్ని హైడ్రేట్ గా మరియు మీ రోజువారీ కావల్సిన విటమిన్ సి మోతాదును మీ శరీరానికి అందిస్తుంది. విటమిన్ సి-రిచ్ డ్రింక్. విటమిన్ సి ఆరోగ్యాన్ని సంరక్షించటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే ఇది చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా. విటమిన్ సి వివిధ రకాలుగా ఉపయోగం చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ లోపాల నుంచి, గుండె జబ్బుల నుంచి, గర్భ సమయంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు , కంటి సమస్యలు మరియు ఆఖరికి చర్మం ముడతలుపడటం నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. విటమిన్ సి ను శరీరం తనంతట తాను ఉత్పత్తి చేసుకోలేదు, అందుకనే విటమిన్ సి లోపం చాలా సాధారణమైనది. పానీయం తయారు చేయడానికి మీకు కావలసిందల్లా ఒక కీరాదోసకాయ, సగం నిమ్మకాయి, ఒక కప్పు పుదీనా మరియు ఒక చిటికెడు నల్ల ఉప్పు.కీరాదోసకాయ ఆరోగ్యానికి ఏంతో మేలు చేస్తుంది. కీరదోసలో విటమిన్స్, వాటర్ కంటెంట్, మినిరల్స్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, ఐరన్ మరియు క్యాల్షియంలు అధికంగా ఉన్నాయి.దోసకాయ మీ శరీరాన్ని తగినంత హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. శిల్పా అరోరా ప్రకారం, కీరదోసలో 95 శాతం నీటి శాతం మరియు ఆస్కార్బిక్ ఆమ్లం మరియు కెఫిక్ ఆమ్లం అనే రెండు సమ్మేళనాలు ఉన్నాయి. కీరదోసలో అధిక నీరు ఉన్నందున విషాన్ని బయటకు తీయడానికి కూడా ఇది సహాయపడుతుంది. కీరదోసకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. దోసకాయ లో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఇది బరువు తగ్గటానికి చాలా సహాయపడుతుంది. కీరదోస రొమ్ము కాన్సర్, అండాశయ కాన్సర్, గర్భాశయ కాన్సర్ మరియు ప్రోస్టేట్ కాన్సర్ వంటి వివిధ రకాలైన క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించే లక్షణాలు కలిగి ఉన్నాయి. నిమ్మకాయలు అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంది, ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగించబడతాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది మరియు కేలరీలు తక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు బరువు తగ్గడంతో సహాయపడుతుంది. యుఎస్‌డిఎ డేటా ప్రకారం, 100-గ్రాముల నిమ్మ గుజ్జులో కేవలం 29 కేలరీలు ఉంటాయి. నిమ్మకాయ శరీరంలోని విష పదార్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది మరియు బ్యాక్టీరియాను ఫ్లష్ చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తుంది, ఇది కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఇది ఆల్కలీన్ స్వభావం కారణంగా శరీరంలో నీటిని నిలుపుకోవటానికి మరియు పిహెచ్ స్థాయి సమతుల్యతకు సహాయపడుతుంది.పుదీనా లేదా ' మింట్ ' అని పిలువబడే ఈ ఆకు రకం మండే వేసవిలో సైతం శరీరానికి స్వాంతన చేకూర్చడంలో ఉత్తమ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఘాటైన సువాసనతో పాటు.. కమ్మని రుచితో నోరూరించే పుదినలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. రుచితో పాటు ఔషధ గుణాలున్న పుదినా ఆకును డైట్ లో చేర్చుకుంటే.. రకరకాల సమస్యలకు గుడ్ బై చెప్పవచ్చు. పోషకాలు పుష్కలంగా ఉన్న పుదిన ఆకు క్రిములను నాశనం చేస్తుంది. మలినాలను శరీరం నుంచి బయటకు పంపుతుంది. పుదినా ఆకును నిత్యం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికే కాదు.. చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది.ఇది శరీరానికి ఊరటనివ్వడమే కాకుండా, ఆరోగ్యప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. పుదీనా శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుoది. పుదీనా చాలా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉందని మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి మరియు చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి అద్భుతమైనదని శిల్పా అరోరా చెప్పారు. జీర్ణ లక్షణాల వల్ల బరువు నిర్వహణలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పుదీనా దీర్ఘకాలిక దగ్గు వల్ల కలిగే చికాకును కూడా తొలగిస్తుంది.మీరు చేయాల్సిందల్లా ఒక జ్యూసర్‌ లో ఈ పదార్థాలను వేసి, జ్యూస్ లా చేసి చిటికెడు నల్ల ఉప్పు లేదా చాట్ మసాలా వేసి త్రాగాలి. ప్రతిరోజూ ఒక గ్లాసు తాగడం వల్ల రోగనిరోధక శక్తి మరియు కాలానుగుణ మార్పు వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలను దరిచేరనివ్వదు.

Related Posts