30 వేల శానిటైజర్ లను మంత్రి అనిల్ కు అందజేసిన వ్యాపార సంఘాలు
నెల్లూరు ఏప్రిల్ 2
నెల్లూరు జిల్లాకు చెందిన వివిధ వ్యాపార వర్గాల వారు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు గురువారం 30 వేల శాని టైజర్ లను అందజేశారు. ఈ కార్యక్రమం ఇస్కాన్ సిటీ ప్రాంతంలో ఉన్న మంత్రి కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరానికి చెందిన సింహపురి వాణిజ్య మండలి, దాల్ మిల్ అసోసియేషన్, టామరిండ్ మర్చంట్స్ అసోసియేషన్, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ తదితర వ్యాపార సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి తన సొంత నిధుల నుండి 2లక్షల చెక్కులు అందజేశారు. పిఎన్ఆర్ బాత్ హౌస్ నిర్వాహకులు లక్ష రూపాయల చెక్కును మంత్రి అరుణ్ కుమార్ కు అందజేశారు. సంగం మండల మాజీ జడ్పిటిసి ఇందూ ధర్ రెడ్డి లక్ష రూపాయల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న లాక్ డౌన్ పాటించి ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి ముక్కాల ద్వారకానాథ్, వైకాపా నగర అధ్యక్షులు శ్రీరామ్ సురేష్,, అసోసియేషన్ నాయకులు పెసల నరసింహ స్వామి, సురేష్, పెసల సురేష్, దాస లక్ష మీ నారాయణ, సొల్లేటి వెలు గుండయ్య తదితరులు పాల్గొన్నారు.
=======