కరోనా ఎఫెక్ట్ : ప్రపంచ బ్యాంకు 100 కోట్ల డాలర్ల భారతదేశానికి అత్యవసర నిధులు
కరోనావైరస్ విజృంభణను ఎదుర్కోవటం కోసం ప్రపంచ బ్యాంకు 100 కోట్ల డాలర్ల భారతదేశానికి అత్యవసర సాయంగా భారతదేశానికి 100 కోట్ల డాలర్లు (సుమారు 7,613 కోట్ల రూపాయలు) ప్యాకేజీ అందించటానికి ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. వైరస్ మహమ్మారి వ్యాప్తిని నివారించటానికి ప్రపంచ బ్యాంకు మొత్తం 25 దేశాలకు దాదాపు 200 కోట్ల డాలర్ల నిధులు అందించేందుకు ఆమోదించింది . ఈ అత్యవసర ఆర్థిక సాయంలో పెద్దమొత్తం భారతదేశానికి ఇస్తోంది. వైద్యపరమైన అవసరాలకు ‘‘వైరస్ స్క్రీనింగ్‌ను మెరుగుపరచటం, కాంటాక్ట్‌ల ఆచూకీ తెలుసుకోవటం, లేబొరేటరీ డయాగ్నోస్టిక్స్, వ్యక్తిగత రక్షణ పరికరాల కొనుగోళ్లు, కొత్త ఐసొలేషన్ వార్డుల ఏర్పాటుకు తోడ్పడటం కోసం’’ ఈ ప్యాకేజీ అందిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు చెప్పింది. దక్షిణాసియాలో.. పాకిస్తాన్‌కు 20 కోట్ల డాలర్లు, అఫ్ఘానిస్తాన్‌కు 10 కోట్ల డాలర్లు, శ్రీలంకకు 12.86 కోట్ల డాలర్లు, మాల్దీవులకు 73 లక్షల డాలర్లు అందించటానికి వరల్డ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది.