YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మద్యం దొరక్క మందుబాబుల వింత చేష్టలు , ఎర్రగడ్డ ఆస్పత్రికి పెరిగిన రద్దీ

లాక్‌డౌన్ కారణంగా ఎక్కడ మద్యం దొరక్క నిస్పృహతో  వింతగా ప్రవర్తిస్తున్న వారితో హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాల కొద్ది రోజులుగా  కిటకిటలాడుతోంది. మానసిక అశాంతి, మూర్ఛ వంటి లక్షణాలతో వచ్చేవారి సంఖ్య పెరిగిందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. 200కు పైగా మంది చికిత్స కోసం ఎర్రగడ్డ ఆస్పత్రికి మార్చి 30 నుంచి ఇప్పటి వరకు వచ్చారని మానసిక వైద్యులు వెల్లడించారు కొంతమందికి అదే రోజు చికిత్స అందించి పంపిస్తున్నారు. మరికొందరికి మాత్రం అత్యవసర వైద్య సేవలు అందించాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. సోమవారం నిజామాబాద్‌లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఇది మొదటి సంఘటన కాదని పోలీస్ అధికారులు తెలిపారు. గతవారం హైదరాబాద్‌లో కూడా ఒక వ్యక్తి మద్యం దొరకలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Related Posts