నందీశ్వరా
శిలాదమహర్షి దంపతులకు ఎన్ని నోములు నోచినా... ఎన్నెన్ని తీర్థక్షేత్రములు సేవించినా సంతానం కలగలేదు... అందుకు ఆ మహర్షి మిక్కిలి చింతించి సంతానం కోసం శివుని గూర్చి కఠోర తపస్సు చేశాడు... అనేక సంవత్సరాల తపస్సు ఫలించి పార్వతి పరమేశ్వరులు శిలాదునికి దర్శనమిచ్చారు. మహర్షీ... నీ జాతకమున సంతానయోగం లేదు... అయినా తపస్సుచే నన్ను మెప్పించావు... కాన నీకొకపుత్రుని ప్రసాదిస్తున్నాను... అతడు శాశ్విత కీర్తివంతుడవుతాడు... కానీ అల్పాయుష్కుడే... అని వరమిచ్చి ఆదృశ్యమైనాడు శంకరుడు...... శిలాదుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. చాలాకాలం ఎదురుచూసినా సంతానం కలగనందున... అందునిమిత్తం ఒక యఙ్ఞమును చేయతలపెట్టి యఙ్ఞగుండమునకై భూమిని తవ్వుచుండగా ఆ గుండము నందు ఒక బాలుడు కన్పించాడు... అదే ఈశ్వర ప్రసాదమని భావించి... అయోనిజుడై జన్మించిన ఆ బాలుని తీసుకుని ముద్దాడి... అతడికి నామకరణం చేయబోతుండగా... ఆ శరీరవాణి... ఓ... మహర్షీ... ఆ బాలుడు మీకేగాక... ఎల్లలోకములకూ... పార్వతి పరమేశ్వరులకు ఆనందం కలగజేయ్యగలడు... గాన బాలునికి "నందుడని"
నందునికి ఐదవ ఏట అక్షరాభ్యాసం... ఎనిమిదవ ఏట ఉపనయనం చేసి... వేదములను నేర్పసాగారు... చతుర్వేదములను... అష్టాదశ పురాణములు... అరు శాస్త్రములు... ఆ చిరకాలమున నేర్చి... ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్నీ కలిగించాడు... ఒకసారి మిత్రావరన మహర్షి వారి ఆశ్రమానికి రాగా శిలాదుడు అతిధ్యమిచ్చి... సత్కరించి తమ కుమారుని జాతకమును పరశీలంచమని కొరాడు... నందుని జాతక చక్రమును చూసి... ఈతడు మహర్జాతకుడే కానీ అల్పాయుష్కుడు అని తెలిపాడు... ఆ మాటలు విన్న శిలాద దంపతులు బాధ పడుచుండగా... ఆ విషయం తెలుసుకున్న నందుడు... తల్లిదండ్రులను ఓదార్చుతూ... పుట్టిన ప్రాణి గిట్టుట సహజం... అందులకు విచారించకూడదు... ఐననూ నన్ను మీకు ప్రసాదించినవాడు ఆ ఈశ్వరుడు... నేను తపస్సు చేసి... ఆ ఈశ్వరానుగ్రహము సంపాదించి మిమ్మలని ఆనందింపజేస్తాను అని తపస్సుకై వెడలాడు.... కేధారక్షేత్రము నందు నందుడు భక్తి తన్మయత్వంతో ఈశ్వరుని గాంచుచూ... ఘోర తపస్సు చేయసాగాడు... తపస్సుకి మెచ్చి ఈశ్వరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు... ప్రభూ మీ దర్శన భాగ్యం లభించిన తర్వాత... నాకు ప్రాపంచిక విషయములందు ఆసక్తి నశించినది... మీ సందర్శన... మీ సేవాభాగ్యం... అహర్నిశలూ ప్రసాదించమని కొరాడు...ఈశ్వరుడు సంతోషంతో... కారణజన్ముడవైన నీవు కోరాల్సిన వరమే కోరినావు... కావున నీవు మా చెంతనే మాకు వాహనము గానూ... రుద్రగణములకు ప్రతినిధి గానూ... "నందీశ్వరుడనే" పేర నివశించి చిరాయుష్ముంతుడవై మాతో గూడి వర్ధిల్లగలవు... అని వర ప్రదానం చేసి ఆశీర్వదించాడు... అంతట నందుడు శివునికి వాహనమై... అతనికి సచివుడై... సన్నిహితుడై... "నందీశ్వరుడు" గా విరాజిల్లుతున్నాడు...!
!!... నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర ...!!
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో