సమ్మర్ తో దీర్ఘకాలిక వ్యాధులు
ఏలూరు, ఏప్రిల్ 3
గతేడాదితో పోలిస్తే సాధారణ ఉష్ణోగ్రతలు ఈ ఏడాది మరో 2 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ప్రభావం గదిలోపల కూడా ఉంటుంది. సాధారణంగా 27 డిగ్రీల టెంపరేచర్ ఉండే నివాస గృహాల్లో ఎండ దెబ్బకి 30 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుంది.ఆరు బయట 40 డిగ్రీలు, మూసివున్న డాబా గదుల్లో 45 డిగ్రీల వరకూ, అద్దాలుమూసి నిలిపి ఉంచిన కార్లు, వ్యాన్లలో 140 డిగ్రీల వరకూ ఉండే అవకాశాలు ఉంటున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మండుతున్న ఉష్ణోగ్రతలు దీర్ఘకాలిక మందుల పనితీరుపై సూర్యుడి ప్రభావం చూపి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రస్పుటంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ♦ మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక మందులు సాధారణంగా 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపర్చాలి. ముఖ్యంగా జానుమెట్, జార్డియాన్స్, కొమ్బిగ్‌లైజా, సిటాగ్లిప్టిన్, కార్ధేస్, ఆటర్వా స్టాటిన్, రాబెప్రజోల్, మేకోబాలమిన్ వంటి మందులు 30 డిగ్రీలలోపు, అమరిల్, విల్ధాగ్లిప్టిన్ , మెట్ఫార్మిన్, సారోగ్లిటజార ఆమ్లోడిపిన్, క్లిన్దపిన్,æ విటమిట్ ఇ, డి మందులు 25 డిగ్రీ టెంపరేచర్ లోపు భద్రపర్చాలి. ♦ ఇన్సులిన్ గుడ్డులో ఉండే ప్రోటీన్ వంటిదేనని, కొద్దిసేపు అదిక వేడిమికి గురైన గుడ్డును వేడిచేసే ఉడికినట్లు, ఇన్సులిన్ కూడా అదే విధంగా మారుతుందని నిపుణులు చెపుతున్నారు. అనంతరం ఫ్రిజ్ వంటి వాటిలో ఉంచి వాడినా ప్రయోజనం వుండదని చెపుతున్నారు. మందులు కొనుగోలు చేసే సమయంలోనే నిర్ధిష్ట ఉష్ణోగ్రతలు ఉన్న మందుల షాపుల్లో కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలో ఉంచిన మందులు వాడటం వల్ల వ్యాధులు అదుపులో ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.♦ రిఫ్రిజిరేటర్‌లు లేని వారు మట్టికుండలో నీళ్లు పోసి, దానిలో ఇన్సులిన్‌ను భద్రపరుచుకోవచ్చు. ప్రయాణాల్లో దీర్ఘకాలికమందులు, ఇన్సులిన్‌లను కూలెంట్ పౌచ్లలోనే తీసుకెళ్లడం మంచిది. తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచినా కొన్ని మందులు పనిచేయవని నిపుణులు సూచిస్తున్నారు.ఇన్సులిన్ వాడుకునే వాళ్లు బాటిల్స్, ఇన్సులిన్ పెన్‌లను ఐస్‌బాక్స్ లేదా, ఐస్ ఉన్న ప్లాస్కోలో ఉంచుకోవాలి. వాటని ఇన్సులిన్ స్టాక్‌ను ఫ్రీజ్ డోర్ అడుగుభాగంలో పెట్టుకోవాలి. డీప్ ప్రీజర్‌లో ఉంచరాదు. ఏవీ అందుబాటులో లేకపోతే మట్టికుండలో చన్నీళ్లు పోసి, దానిలో భద్రపరుచుకోవచ్చు. అనుకోకుండా షుగర్ ఎక్కువుగా ఉంటున్నట్లయితే వేడికి ఇన్సులిన్ సరిగా పనిచేయక పోయి ఉండవచ్చు. అదే రకం కొత్త ఇన్సులిన్ బాటిల్ స్టోరేజ్ కరెక్ట్‌గా ఉన్నది వాడి చూడండి. బయటకు వెళ్లే టప్పుడు సరిపోను ఆహారం, గ్లూకోజ్ టెస్ట్‌స్ట్రిప్స్, మందులు రోజుకు సరిపడా తీసుకు వెళ్లడమే కాకుండా, అందుబాటులో ఉంచుకోవాలి