YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చినరాజప్ప దారెటు...

చినరాజప్ప దారెటు...

చినరాజప్ప దారెటు...
రాజమండ్రి, ఏప్రిల్ 3
ఆయన సుదీర్ఘ కాలం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అధికారంలో ఉన్నప్పుడు హోంమంత్రిగా ఉన్నారు. సౌమ్యుడిగా పేరు. పార్టీకి విధేయతకల్గిన వాడిగా ముద్ర ఉంది. అయితేనేం ఆయన పార్టీని జిల్లాలో అస్సలు పట్టించుకోవడం లేదు. ఆయనే నిమ్మకాయల చినరాజప్ప. నిమ్మకాయల చిన రాజప్ప తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఎక్కువ కాలం పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, యువనేత లోకేష్ వద్ద నిమ్మకాయల చినరాజప్పకు మంచి మార్కులే ఉన్నాయి.2014 ఎన్నికల్లో చినరాజప్ప పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. లక్కీగా అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో నిమ్మకాయల చినరాజప్పను చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకున్నారు. కీలకమైన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవిని ఇచ్చారు. ఐదేళ్ల పాటు నిమ్మకాయల చినరాజప్ప హోంమంత్రిగానే సాగారు. మరోవైపు జిల్లాలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నప్పటికీ చినరాజప్ప జిల్లాలో తన హవా చాటారు.ఇందుకు కారణం లేకపోలేదు. చినరాజప్పకు చినబాబు లోకేష్ సపోర్ట్ గా ఉండేవారు. జిల్లాలో పార్టీ విషయాలను తెలుసుకునేందుకు లోకేష్ నిమ్మకాయల చినరాజప్పపైనే ఆధారపడే వారు. దీంతో చినరాజప్ప చెప్పినట్లే నడిచేది. కాకినాడ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో యనమల కంటే చినరాజప్ప కీలకంగా వ్యవహరించారు.2019 ఎన్నికల్లోనూ చినరాజప్ప పెద్దాపురం నుంచి విజయం సాధించారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత చినరాజప్ప పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు.ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో ముఖ్యనేతలు టీడీపీని వీడారు. వైసీపీలో చేరారు. అలాగే చినరాజప్ప సొంత నియోజకవర్గం అయిన అమలాపురంలో కూడా పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఇక్కడకూడా అనేక మంది పార్టీని వీడారు. అయినా నిమ్మకాయల చినరాజప్ప మాత్రం పట్టించుకోలేదు. అయితే ఇక్కడ ఒక మాట పార్టీ నేతల నుంచి విన్పిస్తుంది. చినరాజప్పను కేర్ చేసే వారు అప్పుడూ, ఇప్పడూ ఎవరూ లేరని, అధిష్టానం దగ్గర తీయడం వల్లనే ఆయనకు కొద్దో గొప్పో పరపతి పెరిగిందన్నది పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు. చినరాజప్ప నాయకత్వం ఏంటో ఇప్పుడు అధిష్టానానికి తెలిసి వస్తుందని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related Posts