YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఐదు రాత్రి 9గంటలకు9 నిమిషాలు జ్యోతులు వెలిగించాలి : ప్రధాని

ఐదు రాత్రి 9గంటలకు9 నిమిషాలు జ్యోతులు వెలిగించాలి : ప్రధాని

ఐదు రాత్రి 9గంటలకు9 నిమిషాలు జ్యోతులు వెలిగించాలి : ప్రధాని
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3  
కరోనాపై పోరులో భారతజాతి మొత్తం ఏకతాటిపై ఉందన్న విషయాన్ని మరోసారి తెలియజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశమంతా ఐక్యంగా పోరాడితేనే కరోనా పై విజయం సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆయన దేశప్రజలకు వీడియో సందేశం పంపారు. కరోనాపై యుద్ధం చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు మోదీ. అందరం ఇళ్లల్లోనే ఉండి కొన్ని రోజులుగా కరోనాపై యుద్ధం చేస్తున్నామన్నారు. చాలా దేశాలు మన తరహాలోనే లాక్ డౌన్ ను పాటిస్తున్నాయని మోదీ గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటే కరోనాపై యుద్ధం చేసినట్లేనని తెలిపారు. వచ్చే ఆదివారం ఏప్రిల్ 5వ తేదీన 130 కోట్ల మంది ప్రజలు రాత్రి 9గంటలకు ప్రతి ఇంట్లో అందరూ ఇళ్లల్లో విద్యుత్తు దీపాలు ఆపేయాలన్నారు. తొమ్మిది నిమిషాలు విద్యుత్ దీపాలు ఆపివేయాలని కోరారు. కొవ్వుత్తులు, దీపం, మొబైల్ ఫ్లాష్ లైట్లతో సంఘీభావం ప్రకటించాలన్నారు. దీంతో కరోనా చీకట్లను తరిమివేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఎవరు ఎక్కడ ఉన్నా లైట్లు ఆర్పివేయాలన్నారు. దేశ ప్రజల సంకల్ప శక్తిని వెలిగించాలన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని మోదీ ధన్యవాదాలు తెలిపారు. స్వీయ నిర్భంధంలో ఉన్నా మనం ఒంటరి కాదని నిరూపించాలని కోరారు. ఇప్పటివరకూ 9 రోజుల పాటు విజయవంతంగా లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేశామని, మరో 11 రోజుల పాటు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలోని అన్ని లైట్లనూ ఆర్పివేయాలని, ఆపై వీధుల్లోకి రాకుండా, తలుపుల వద్ద నిలబడి, వీలైనన్ని ఎక్కువ దీపాలను, కవ్వోత్తులను వెలిగించాలని మోదీ కోరారు. సెల్ ఫోన్లలోని ఫ్లాష్ లైట్లను, టార్చి లైట్లను వెలిగించాలని, ఈ సమయంలో వీధుల్లోకి మాత్రం ఎవరూ రావద్దని ఆయన కోరారు. తద్వారా జాతి సంకల్పం ఒకటేనన్న సందేశాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేశారు.ఇండియాలో అమలు అవుతున్న లాక్ డౌన్ ను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నదని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను గమనిస్తోందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇండియాను ఎన్నో దేశాలు ఇప్పుడు అనుసరిస్తున్నాయని తెలిపారు. 130 కోట్ల మంది ఒకే పని చేస్తే, ప్రపంచానికి ఓ సంకేతం వెళుతుందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 9న జ్యోతులు వెలిగించి, మన సంకల్పాన్ని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు.

Related Posts