YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆ మూడు రాష్ట్రాలు... రెండు జిల్లాలు

ఆ మూడు రాష్ట్రాలు... రెండు జిల్లాలు

ఆ మూడు రాష్ట్రాలు... రెండు జిల్లాలు
విజయనగరం, ఏప్రిల్ 3
కరోనా వైరస్ చెబుతున్న పాఠంగా ఇది కనిపిస్తోంది. ఎవరైతే తాము అభివృధ్ధి చెందామని అనుకుంటున్నారో, ఏ ప్రాంతమైతే మేము ఎక్కడో ఆకాశన ఉన్నామని మురిసిపోతోందో ఆయా ప్రాంతాలన్నీ కరోనా కాటుకు చిక్కుకుని ఇపుడు నిలువునా విలవిలలాడుతున్నాయి. అది దేశమైనా, రాష్ట్రమైనా, జిల్లాలైనా కూడా ఇదే రకమైన సారూప్యం కనిపిస్తోంది. రెండు వందల దేశాలకు వ్యాపించిన కరోనా ఆఫ్రికన్ కంట్రీస్ లో తక్కువగా ఉందని అంటున్నారు. ఇక భారత దేశంలో చూసుకుంటే జార్ఖండ్, చత్తీస్ ఘడ్, మణిపూర్, ఒడిషా ఇలా చెప్పుకుంటూ పోతే మన దృష్టిలో లేనివి, లిస్టులోకి రాని రాష్ట్రాలు కరోనాకు కూడా అక్కరలేకుండా పోయాయి.ఇక ఏపీ విషయానికి వస్తే ఇపుడు రెండు జిల్లాలు అందరినీ ఆలోచనలో పడేస్తున్నాయి. కరోనా కేసులు ఒక్కటి కూడా ఇక్కడ నమోదు కాలేదంటే ఆశ్చర్యమే మరి. ఇక పొరుగున ఉన్న ఒడిషా రాష్ట్రం తీసుకుంటే కేవలం నాలుగంటే నాలుగు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అంటే కరోనా కట్టడి ఇక్కడ ఒక లెక్కలో ఉందన్నమాట. నిజానికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అభివృధ్ధికి ఆమడదూరం అంటారు. జిల్లా కేంద్రాలే పెద్ద పంచాయతీల్లా ఉంటాయి. అందుకేనా కరోనా ఈ వైపు చూడలేదు అనిపిస్తోంది.నిజానికి మరో మాట చెప్పుకోవాలంటే ఆ మాత్రం ఈ మాత్రం అభివృధ్ధి చెందిన ఈ జిల్లాల జనాలు పూర్తిగా విశాఖలో, ఇతర ప్రాంతాలలో పూర్తిగా సెటిల్ అయిపోయారు. దాంతో వారి కుటుంబాల నుంచి అమెరికా వెళ్ళేవారు కూడా విశాఖకే తిరుగుటపాలో వచ్చారు. ఆ విధంగా వీరికి సొంత జిల్లాలతో లింకులు ఏనాడో తెగిపోయాయి. అదే ఇపుడు కరోనా వైరస్ నుంచి కాపాడిందని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. ఇక ఏపీలో పదమూడు జిల్లాలు ఉంటే అభివృధ్ధి చెందిన జిల్లాలుగా చెప్పుకునే ఉభయ‌ గోదావరి, విశాఖ, గుంటూరు, విజయవాడ, ప్రకాశం, మత ప్రార్ధనల పుణ్యమాని కడప, నెల్లూరు వంటి జిల్లాల్లో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు.మితిమీరిన అభివృధ్ధి కూడా వినాశనమేనని కరోనా అనుభవం ప్రపంచానికి చాటి చెప్పింది. అనాగ‌రికమైన ప్రపంచంలో జీవిస్తూ అదే అభివృధ్ధి అని భావిస్తూ ప్రకృతికి ఎదురువెళ్తూ తామే గొప్ప అనుకున్న వారంతా కరోనా కాటుకు బలి అయిపోతున్నారు. అదే సమయంలో ప్రక్రుతికి దగ్గరగా ఉన్నవారు. ఉన్నంతలోనే అంతా అని గడుపుతున్న వారు మాత్రం కరోనా వేటు నుంచి తప్పించుకుంటున్నారు. మరి ప్రకృతి నేర్పిన ఈ నయాపాఠాన్ని ఇకపైన అయినా అంతా గుర్తించకపోతే ఇలాంటి విలయాలు, ప్రళయాలను మరిన్ని భవిష్యత్తులో మరిన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందేమో.

Related Posts