YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

విలవిలలాడుతున్న ఐరోపా దేశాలు

విలవిలలాడుతున్న ఐరోపా దేశాలు

విలవిలలాడుతున్న ఐరోపా దేశాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3
కరోనా దెబ్బకు యూరప్ దేశాలు వణికిపోతున్నాయి. ఇందులో ప్రధానంగా కరోనా వైరస్ తో జర్మనీ అతలాకుతలమవుతోంంది. జర్మనీలో ఇప్పటికే పరిస్థితులు చేయి దాటి పోతున్నాయి. రానున్న వారం రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. జర్మనీ త్వరలోనే ఇటలీని మించిపోతుందన్న వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో విన్పిస్తుండటం విశేషం.ఈ ఏడాది జనవరి 26న జర్మనీలో తొలి కేసు నమోదయింది. అయితే వెంటనే తేరుకున్న జర్మనీ వైద్యాన్ని అందించడంతో కొంత తగ్గుముఖం పట్టింది. అయితే లాక్ డౌన్ ను విధించలేదు. దీంతో ఒక్కసారిగా జర్మనీలో కేసులు పెరిగిపోయాయి. మార్చి మొదటి వారం వరకూ జర్మనీలో 200 కరోనా కేసులు మించలేదు. అయితే కేవలం వారం వ్యవధిలోనే కరోనా వైరస్ జర్మనీ అంతటా వ్యాప్తి చెందింది. ప్రస్తుతం జర్మనీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేలకు చేరుకుంది.అయితే జర్మనీలో కరోనా వైరస్ కారణంగా మరణాల సంఖ్య కొంత తక్కువగానే ఉందని చెప్పాలి. తాము ఎక్కువ మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తుండటం వల్లనే సంఖ్య ఎక్కువగా కనపడుతుందని జర్మనీ ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో భయపడిన ప్రభుత్వం మార్చి రెండో వారంలో లాక్ డౌన్ విధించింది. కానీ పకడ్బందీగా అమలు చేయలేక పోయింది. ప్రజలు కూడా లాక్ డౌన్ ను లైట్ గానే తీసుకోవడంతో జర్మనీకి కరోనా దెబ్బ ఎక్కువగా తాకిందని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తుంటే జర్మనీలో రోజుకు పదివేలు కరోనా పాజిటివ్ కేసులు వచ్చే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అంతకుముందు జర్మనీ కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న ఇటలీకి సాయం చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. జర్మనీ ఇతర దేశాల సాయం కోసం ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జర్మనీ ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. సరైన చర్యలు సరైన సమయంలో తీసుకోకపోవడంలోనే జర్మనీ కరోనా బారిన పడింది.

Related Posts