YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

20 రాష్ట్రాలకు అంటిచేశారు...

20 రాష్ట్రాలకు అంటిచేశారు...

20 రాష్ట్రాలకు అంటిచేశారు...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 
మత ప్రార్థనలు తప్పు కాదు. సంస్కృతి, సంప్రదయాలు ఆచరించడాన్ని ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ విపత్కర సమయంలో వీటికి దూరంగా ఉండాలన్న కనీస జ్ఞానం లేకపోవడంతోనే భారత్ కు సమస్య తెచ్చిపెట్టింది. భారత్ లో గత నాలుగు రోజుల నుంచి పెరుగుతున్న కేసులన్నీ తబ్లిగ్ జమాత్ సమావేశం వల్లనే అన్నది అందరికీ సుస్పష్టం. లాక్ డౌన్ కు ముందే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా వీరు పట్టించుకోలేదు. ఫలితం ఇప్పుడు ఇండియా కోలుకోలేని స్థితికి చేరుకుంది.తబ్లిగి జమాత్ సమావేశం ఐదు రోజుల పాటు జరిగాయి. దాదాపు ఏడు వేల మందికి పైగానే ఈ ప్రార్థనలకు హాజరయ్యారు. ఇతర దేశాల నుంచి ప్రతినిధులు పెద్దయెత్తున హాజరవ్వడంతోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ప్రజల ప్రాణల కన్నా వీరికి ప్రార్థనలే ముఖ్యమయ్యాయన్న విమర్శలు దేశ వ్యాప్తంగా విన్పిస్తున్నాయి. మత ప్రార్థనలు ఢిల్లీలో పూర్తయ్యాక వీరందరూ వారి స్వస్థలాలకు వెళ్లారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధికంగా వీరున్నారు. కాశ్మీర్ లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తి మృతి చెందడంతోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఇప్పుడు వీరిని కనుగొనడం రాష్ట్రాలకు సమస్యగా మారింది. మత సమస్య కాకుండా చూడాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు స్వచ్ఖందంగా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు వైద్య పరీక్షలు చేయించు కోవాలని ఎంతగా కోరుతున్నా ఇంకా అనేక మంది జాడ తెలియక పోవడం ఆందోళన కల్గస్తుంది. మర్కజ్ మసీదులో ఉన్న 2,361 మందిని అధికారులు ఆసుపత్రులకు తరలించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాష్ట్రాలకు ఈ వైరస్ అంటుకుంది.ఎంతగా మత విశ్వాసాలు ఉన్నాయంటే రాజస్థాన్ లో మొన్న వంద మంది మతప్రార్థనలకు హాజరయ్యారు. వారిని అక్కడి నుంచి పంపించేయడానికి లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది. దాదాపు 20 రాష్ట్రాల నుంచి ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లడంతో ఆ రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తికి కారణమయ్యారని ప్రభుత్వాలు చెబుతున్నాయి. మొత్తం వీరంతా ఐదు రైళ్లలో ప్రయాణించారని అధికారులు గుర్తించారు. వీరు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే దురంతో ఎక్స్ ప్రెస్, జీటీ ఎక్స్ ప్రెస్, తమిళనాడు ఎక్స్ ప్రెస్, రాజధాని ప్రెస్, సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లలో ప్రయాణించారు. వీరిని కనుగొనే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయ. వీరిలో ఇప్పటికి ఆరు వేల మందిని మాత్రమే గుర్తించారు. మిగిలిన వారి కోసం గాలింపు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Related Posts