YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

ఇక రోడ్లపైకి కనిపిస్తే... జైలే

ఇక రోడ్లపైకి కనిపిస్తే... జైలే

ఇక రోడ్లపైకి కనిపిస్తే... జైలే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ చాలా మంది బాధ్యత లేకుండా లాక్ డౌన్ ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. మరోవైపు, దేశంలోనూ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకునేందుకు కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.ఏ నిబంధన ఉల్లంఘించిన వారిపై ఏ చర్య తీసుకోవాలనే విషయాన్ని చెబుతూ పూర్తి జాబితాను రాష్ట్రాలకు పంపించారు. లాక్‌డౌన్ అమలును ఉల్లంఘించే వారిపట్ల జాతీయ విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చని స్పష్టంటూ పేర్కొంటూ నిబంధనల జాబితాను కేంద్రం రాష్ట్రాలకు పంపించింది. ఈ జాబితా అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. లాక్ డౌన్‌ను ఉల్లంఘిస్తే పడే శిక్షల గురించి ప్రజల్లో బాగా ప్రచారం కల్పించాలని కోరింది.ప్రస్తుతం దేశంలో కరోనా రోగుల సంఖ్య 2 వేలు దాటింది. కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం రాత్రి ప్రకటించిన ప్రకారం మొత్తం కొవిడ్ కేసులు 2069 నమోదయ్యాయి. వీరిలో రికవరీ అయిన వారు 156 మంది ఉండగా, చనిపోయిన వారి సంఖ్య 53గా ఉంది.

Related Posts