కరోనా ఎఫెక్ట్... ఎంట్రన్స్ టెస్ట్ లు వాయిదా...?
హైద్రాబాద్, ఏప్రిల్ 3,
మేలోనిర్వహించాలనుకున్నకామన్ ఎంట్రెన్స్ టెస్టులు వాయిదా పడే అవకాశాలున్నాయి. ఇంటర్ వాల్యూయేషన్ ఆగిపోవడం, డిగ్రీ సెమిస్టర్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉండడంతో పోస్ట్ పోన్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే అప్లై చేసుకోవడానికి డేట్ ను కూడా ఈ నెల 20వ తేదీ వరకు ఎక్స్ టెండ్ చేశామని, ఉన్నత విద్యా మండలి చైర్మెన్ పాపిరెడ్డి తెలిపారుఎంసెట్ సహా వివిధ ఎంట్రెన్స్ టెస్టులు షెడ్యూల్ ప్రకారం జరిగే చాన్స్ కనిపించడం లేదు. కరోనా కట్టడికి ఈ నెల 14 వరకు లాక్డౌన్ అమలులోఉండటంతో సెట్స్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అన్ని కామన్ ఎంట్రెన్స్ టెస్టులు (సెట్స్) మే నెలలో నిర్వహించేందుకు గతంలోనే రాష్ట్ర ఉన్నత విద్యామండలి షెడ్యూల్ప్ ప్రకటించింది. దీని ప్రకారం మే 2న ఈసెట్ తో ప్రారంభమై.. మే 27న లాసెట్ తో ముగియాల్సి ఉంది. మే 4 నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కావాలి. అయితే ఈ నెల 14 తర్వాత లాక్డౌన్ ఎత్తేస్తారనే దానిపై క్లారిటీ లేదు. అంతా సర్దుకొని.. ఈ నెలాఖరులో సెట్స్ ప్రక్రియ ప్రారంభమైనా మే నెలలో ప్రవేశపరీక్షలు నిర్వహించడం కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్ వాల్యూయేషన్ ఆగిపోవడం, డిగ్రీ సెమిస్టర్స్ కూడా జరగకపోవడంతో ఎంసెట్ సహా మిగతా సెట్స్ కు వాయిదా తప్పేలా లేదని పేర్కొంటున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.కరోనా ఎఫెక్ట్ తో ప్రవేశ పరీక్షల దరఖాస్తు తేదీ గడువును ఉన్నత విద్యామండలి పెంచింది. ఈ నెల 20 వరకూ ఎలాంటి ఫైన్ లేకుండా అన్ని సెట్స్ కు అప్లై చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి చైర్మెన్ పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీఈసెట్, లాసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్ తదితర హాజరయ్యే స్టూడెంట్స్ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ఎంసెట్ కు 1.66 లక్షల మంది స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకున్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్లోనూ ప్రవేశపరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 17 వరకు గడువు పెంచారు.