YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ దేశీయం

 సీసీఎంబీ రిజల్ట్స్ తుది దశకు

 సీసీఎంబీ రిజల్ట్స్ తుది దశకు

 సీసీఎంబీ రిజల్ట్స్ తుది దశకు
హైద్రాబాద్, ఏప్రిల్ 2
కరోనా వైరస్ పుట్టుక, దాని ఉనికి గుట్టును తేల్చే దిశగా సీసీఎంబీ పరిశోధనలు ప్రారంభించింది. హైదరాబాద్లో నమోదైన కేసుల్లో 15 శాంపిల్స్ ను సేకరించి వాటి జీనోమ్పై రీసెర్చ్ మొదలు పెట్టారు. నాలుగైదు రోజుల్లో వీటి రిజల్ట్స్ వస్తాయని, అందులో కరోనా గుట్టు తేలుతుందని సైంటిస్టులు చెపుతున్నారు. కరోనా పుట్టుక, వ్యాప్తి, దాని వల్ల మరేమైనా ఇతర వ్యాధులు ప్రబలుతాయా? చైనా, ఇటలీలోని వైరస్కు, మనదేశంలోని వైరస్కు ఏమైనా తేడాలు ఉన్నాయా? అని పరిశోధనలు చేస్తున్నారు. హైదరాబాద్ శాంపిల్స్ వైరస్ జీనోమ్ సీక్వెన్స్, మ్యుటేషన్ పై టెస్టులు చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి శాంపిల్స్ సేకరించనున్నారు.గాంధీ ఆస్పత్రి నుంచి రెండు రోజులుగా సీసీఎంబీకి కరోనా నిర్థారణ పరీక్షలకు సంబంధించి నమూనాలు అందుతున్నాయి. సోమవారం 60 శాంపిల్స్ రాగా.. మంగళవారం మరో 190 శాంపిల్స్ అందాయని మొత్తం 250 నమూనాలకు నిర్థారణ పరీక్షలు చేసి గాంధీకి పంపించినట్లు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్రాకేశ్మిశ్రా తెలిపారు. వెయ్యి శాంపిల్స్ వచ్చినా ఒక్క రోజులోనే టెస్టులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వీటిలో ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయనే వివరాలను వెల్లడించలేమని, ప్రభుత్వమే అధికారికంగా వివరాలు చెపుతుందని అన్నారు.

Related Posts