YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సందేశం

 భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సందేశం

 భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సందేశం
న్యూఢిల్లీ ఏప్రిల్ 3 
ఏప్రిల్ 5న దేశ ప్రజలంతా జాగరణ చేయాలని ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. 130 కోట్ల మంది భారతీయులు ఏప్రిల్ 5 రాత్రి  9 గంటలకు జ్యోతులు వెలిగించి 9 నిముషాల పాటు తమ నివాసాల ముందు నిలబడాలని మోడీ అన్నారు. శుక్రవారం నాడు జాతి నుద్దేశించి ప్రసంగించిన ఆయన కరోనాపై పోరాటంలో మనం ఒంటరులం కామని చాటాలన్నారు. కరోనాపై పోరాటంలో భారత్ విజయం సాధిస్తుందని మోడీ చెప్పారు.  ఏప్రిల్ 5 న రాత్రి 9గంటల నుండి 9 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు బంద్ చేయాలి. ఆదివారం 9గంటలకు కొవ్వొత్తులు, దీపం, టార్చ్ వెలిగించి మనం ఒంటరి కాదు అనే భావన కలిగించండి.  ప్రజలంతా ఇప్పటి వరకు లాక్ డౌన్ ను గౌరవించారు. దేశ ప్రజలంతా ఒక్కటిగా నిలిచారు. లాక్ డౌన్ పెట్టి ఇప్పటికి 9 రోజులు. కరోనా పై యుద్దం చేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు. భారతీయులంతా ఎకమై కరోనాని దేశం నుండి తరిమికొట్టాలి. ప్రజలు మరింత క్రమశిక్షణతో ఉండాలి. ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచింది. బయటికొచ్చి సామూహికంగా చేయవద్దు..ఇంట్లోనే చేయండి. ప్రజలు గుంపులుగా ఉండొద్దని అయన సూచించారు. భారతదేశంలో కరోనా పై యుద్ధం చేస్తున్న 130 కోట్ల ప్రజలు సమిష్టిగా కృషి చేస్తున్నందుకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.
 

Related Posts