తెలంగాణలో చలి క్రమంగా తగ్గుతోంది. రెండు రోజుల తరవాత నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి తెలిపారు. శనివారం తెల్లవారుజామున ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 5, మెదక్‌లో 10, రామగుండంలో 11, హైదరాబాద్‌లో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట 5 డిగ్రీలు తగ్గుతుండగా పగటిపూట 2 డిగ్రీలు పెరుగుతున్నాయి. తూర్పు నుంచి తక్కువ ఎత్తులో చలిగాలులు వీస్తున్నందున ఆదిలాబాద్ చుట్టుపక్కల శీతలంగా ఉంటోంది.