నెల్లూరులో అత్యధిక కరోనా కేసులు నమోదు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సి ఎస్.
నెల్లూరు ఏప్రిల్ 3
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గా నమోదు కాబడిన, జిల్లాలలో అన్నిటికంటే నెల్లూరు జిల్లాలో అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సి ఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం అధికారిక గా విడుదల చేసిన బులెటిన్లో వివరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా161 కరుణ పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలియజేశారు. ఇందులో శుక్రవారం ఒక్కరోజే 12 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు జిల్లాల వారీగా ఆయన తెలిపిన మేరకు నెల్లూరు జిల్లాలో 32 పాజిటివ్ కేసులు నమోదు కాగా కృష్ణా జిల్లాలో 23 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో 20, ప్రకాశం జిల్లాలో 17, పశ్చిమగోదావరి జిల్లాలో 15, విశాఖ జిల్లాలో 14, చిత్తూరు జిల్లాలో 9, తూర్పుగోదావరి జిల్లాలో తొమ్మిది హాస్టల్ కేసులు నమోదైనట్లు తెలియజేశారు. అయితే పాజిటివ్ కేసులు గా గుర్తించబడిన కరోనా వైరస్ కేసులన్నీ ఢిల్లీలోని జమాతే ప్రార్థనకు వెళ్లిన వారేనని తెలియజేశారు. అధికారుల సమాచారం మేరకు ఢిల్లీలోని జమాతే ప్రార్థనకు ఆంధ్ర ప్రదేశ్ నుండి1085 మంది వెళ్లగా వారిలో 946 మంది మాత్రమే ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. వారిలో 881 మందికి పరీక్షలు నిర్వహించ గా, వారిలో 108 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిందని తెలిపారు. ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారితో సంబంధాలు ఉన్న కుటుంబాల నుండి 613 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలోనూ 32 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించడం జరిగిందని తెలియజేశారు. ఈ క్రమంలో 161 మంది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గా నిర్ధారించబడిన వారిలో 104 మంది ఢిల్లీ జమాతే సదస్సుకు వెళ్లిన వారేనని పేర్కొన్నారు.