అమెరికాలో మృత్యు విలయ తాండవం . కరోనా మహమ్మారికి ఒక్కరోజులో 1169 మంది బలి
ఈ మహమ్మారి కారణంగా అమెరికాలో కేవలం 24 గంటల వ్యవధిలో 1,169 మంది కరోనా తో పోరాడి తుది శ్వాశ విడిచారు. కరోనా కారణంగా ఒక్కరోజులో ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇన్ని మరణాలు సంభవించలేదు. . అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటల నుంచి గురువారం రాత్రి 8:30 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కరోజులో అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల్లో ఇప్పటివరకు ఇటలీ(969) ముందుండగా.దాన్ని అధిగమించి ఆ స్థాయికి 1169 మరణాలతో అమెరికా చేరింది. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాలో మొత్తంగా 6,095 మంది మృత్యువాత పడినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. అంతేకాకుండా దేశంలో మొత్తం 2,45,380 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదుకాగా.. వాటిలో 503 కేసులు కొత్తగా నమోదు అయ్యాయి