YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

అణగారిన వర్గాల కోసం కోవిడ్ -19 ఉచిత పరీక్షలు

అణగారిన వర్గాల కోసం కోవిడ్ -19 ఉచిత పరీక్షలు

అణగారిన వర్గాల కోసం కోవిడ్ -19 ఉచిత పరీక్షలు
ఐసీఐసీఐ లాంబార్డ్ ,అపోలో హెల్త్ & లైఫ్ స్టైల్ ,మెట్రోపొలిస్ హెల్త్ కేర్ తో ఒప్పందం
ముంబై, ఏప్రిల్ 3
భారతదేశ అగ్రగామి జీవితేతర బీమా కంపెనీల్లో ఒకటైన ఐసీఐసీఐ లాంబార్డ్ కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరి కట్టేందుకు గాను ఒక విశిష్ట సీఎస్ఆర్ కార్యక్రమానికి నాంది పలికింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో తనకు గల అనుభవం మరియు సంబంధాలను దృష్టిలో ఉంచుకొని అది, దేశ అణగారిన వర్గాల్లో  కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరి కట్టేందుకు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజ్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన అపోలో హె ల్త్ & లైఫ్ స్టైల్ లిమిటెడ్ తో మరియు మెట్రోపొలిస్ హెల్త్ కేర్ తో  భాగస్వామి గా మారింది. ఈ కార్యక్రమంలో భా గంగా కోవిడ్ -19 అనుమానిత కేసులను పరీక్షించేందుకు అవసరమైన టెస్టింగ్ కిట్స్ తో యావత్ స్క్రీనింగ్ ప్రొసీ జర్ కు నిధులను సమకూర్చనుంది.  ఈ కార్యక్రమం కోసం సంస్థ రూ.5 కోట్లు వెచ్చించనుంది. ఇది సమాజం లోని అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చనుంది. టెస్టింగ్ కిట్, ఇంటి నుంచి శాంపిల్ సేకరణ, డయాగ్నసిస్ మరియు టెస్ట్ రిజల్ట్ జనరేట్ చేయడం లాంటివి కలిపి కోవిడ్ -19 టెస్ట్ వ్యయం ప్రస్తుతం రూ.4,500 గా ఉంది. ఇప్పటికే ఈ కార్యక్రమం కింద పేద వర్గాలకు చెందిన 11,000 మంది ప్రయోజనం పొందారు. వీరంతా కూడా వైరస్ లక్షణాలు కలిగి ప్రాధాన్యపూర్వకంగా టెస్ట్ లు చే యించుకోవాల్సిన అవసరం ఉన్నవారే. అంతేగాకుండా టెస్టింగ్ కిట్స్ యొక్క ధరలు తగ్గితే సమాజంలో మరెం తో మందికి ఈ కార్యక్రమం మేలు చేయనుంది. అంత్యోదయ రేషన్ కార్డు మరియు బీపీఎల్ రేషన్ కార్డ్ కలిగిన వారు ఈ కార్యక్రమం కింద ప్రయోజనం పొందేందుకు అర్హులు.ఈ సందర్భంగా ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ భార్గవ్ దాస్ గుప్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఈ సవాళ్ళ సమయంలో సమాజంలోని పేదలు కోవిడ్-19కు లోనయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సకాలంలో స్క్రీనింగ్ అనేది వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో మొదటి అడుగు. అగ్రగామి ఆరోగ్య బీమా సంస్థగా మేము ఆరోగ్యసంరక్షణ ను అందించే సంస్థలతో మా సంబంధాలను మరింత మెరుగుపర్చుకోదలిచాం. భారత ప్రజానీకం కోసం కోవిడ్ -19 స్క్రీనింగ్ మౌలిక వసతులను విస్తరించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు  అపోలో హె ల్త్ & లైఫ్ స్టైల్ లిమిటెడ్ తో మరియు మెట్రోపొలిస్ హెల్త్ కేర్ తో మా భాగస్వామ్యం ఒక జోడింపు కాగలదని మేము విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు. అపోలో హె ల్త్ & లైఫ్ స్టైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ ఆరోగ్య సం రక్షణ వ్యవస్థలోని ఇతర సభ్యులతో భాగస్వామ్యం కావాలన్న ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్షియేటివ్ ను మేము ప్రశం సిస్తున్నాం. అనుమానిత కోవిడ్-19 కేసులను సత్వరమే స్క్రీనింగ్ చేయడం అనేది ఈ మహమ్మారి వ్యాప్తిని అ డ్డుకోవడంలో ఎంతో ప్రభావం కనబరుస్తుంది. అపోలో హెల్త్ & లైఫ్ స్టైల్ మేము ఈ కార్యక్రమం చేపట్టేందుకు సి ద్ధంగా ఉన్నాం. నిజంగా ఇది భారతదేశ పేద ప్రజలకు నిజంగా ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని అన్నారు.మెట్రోపొలిస్ హెల్త్ కేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అమీరా షా మాట్లాడుతూ, ‘‘ఒక మహోన్నత ఆశయం కోసం ఐసీఐసీఐ లాంబార్డ్ తో చేతులు కలపడం మాకెంతో ఆనందదాయకం. ఈ మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఏ విధమైన కోవిడ్ -19 ఇన్ ఫెక్షన్ కైనా సమాజంలోని పేదవర్గాలు సకాలంలో స్క్రీన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్రలో మేము ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అంతేగాకుండా రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తాం’’ అని అన్నారు.ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పించుందుకు ఐసీఐసీఐ లాంబార్డ్, అపోలో హెల్త్ & లైఫ్ స్టైల్ మరియు మెట్రోపొలిస్ హెల్త్ కేర్ కలసి పని చేయనున్నాయి. ప్రజలను చేరుకునే వివిధ కార్యక్రమాల ద్వారా దీని ప్రయోజనాలను వివరించనున్నాయి. ప్రజల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ కార్యక్రమం గణనీయంగా తోడ్పడుతుంది.

Related Posts