గాంధీ ఆసుపత్రి వద్ద కరోనా పోలీసులు
హైదరాబాద్ ఏప్రిల్ 3
కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా డాక్టర్లు పని చేస్తుంటే వారిపై గాంధీ హాస్పిటల్ లో ఒక కరోనా రోగి దాడి చేసిన విషయం తెలిసిందే. దేశం మొత్తం తలదించుకున్న ఈ సంఘటనపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నట్లే కనిపిస్తున్నది.కరోనా రోగులను పట్టుకోవడం వారు పారిపోకుండా చూడటానికి పోలీసులు సాధారణ డ్రస్ కోడ్ లో ఉండి సాహసం చేయలేక పోతున్నారు. కరోనా రోగులు పోలీసులపై ఉమ్మివేయడం లాంటి చర్యలు కూడా నిన్న దేశంలో కొన్ని చోట్ల జరిగాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గాంధీ ఆసుపత్రి వద్ద భద్రత పెంచిన రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు కరోనా డ్రెస్ లు కూడా ఇచ్చింది.వీటిని జాగ్రత్తగా వాడుకుని పోలీసులు తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా డ్రెస్ ఉన్నందున పోలీసులు కూడా భయపడకుండా కరోనా రోగులు ఎదురుతిరిగితే పట్టుకోవడానికి, తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గాంధీ ఆసుపత్రి వద్ద పెరిగిన భద్రత తో డాక్టరు మరింత ఆనందంగా పని చేస్తారనడంలో సందేహం లేదు.