YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అందరం దీపాలు వెలిగిద్దాం : చిరంజీవి

అందరం దీపాలు వెలిగిద్దాం : చిరంజీవి

అందరం దీపాలు వెలిగిద్దాం : చిరంజీవి
హైద్రాబాద్., ఏప్రిల్ 3
భారతీయులంతా కలిసి ఏప్రిల్‌ 5న కరోనా వైరస్‌ అనే అంధకారాన్ని తరిమికొట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 130 కోట్ల మంది ప్రజల మహా సంకల్పాన్ని మరింత ఘనంగా చాటాలని.. దీని కోసం ఈ ఆదివారం (ఏప్రిల్ 5న) రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆపేసి టార్చ్‌, మొబైల్‌ లైట్‌లు, కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలని దేశ ప్రజలను ప్రధాని కోరుతూ ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎవరి ఇంటి గుమ్మం వద్ద వారే జరుపుకోవాలని.. ఎవరూ రోడ్లపైకి రావొద్దని మోదీ సూచించారు. సామాజిక దూరమనే లక్ష్మణ రేఖను ఎవ్వరూ దాటొద్దని అన్నారు.మోదీ పిలుపునిచ్చిన కార్యక్రమానికి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. జనతా కర్ఫ్యూ మాదిరిగానే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని పలువురు ప్రముఖులు ప్రజలను కోరుతున్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ప్రధాన మంత్రి పిలుపును ప్రతి ఒక్కరూ గౌరవించాలని చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘మన ప్రియమత ప్రధాన మంత్రి పిలుపును గౌరవిస్తూ ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మనమంతా దివ్వెలను వెలిగించి కరోనా వల్ల ఏర్పడిన చీకటిని తరిమికొడదాం. మన దేశం ఒక్కటవుదాం, మనం ఒకరికోసం ఒకరం నిలబడతామని పునరుద్ఘాటిద్దాం’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.చిరంజీవి ట్వీట్‌కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. కచ్చితంగా ఈ సూచనలను పాటిస్తామని కామెంట్లు చేస్తున్నారు. ‘మీ బాటలోనే మేము ఎప్పుడూ.. మంచికి ముందు ఉంటాం, చెడుకి వంద అడుగులు వెనక్కి ఉంటాం’ అని మెగా అభిమానులు చిరు ట్వీట్‌కు రిప్లై ఇస్తున్నారు. ఉగాది రోజున చిరంజీవి ట్విట్టర్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి ఆయన తన ట్వీట్లతో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్నారు. మంచి ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు సందేశాన్ని కూడా తన అభిమానులకు ఇస్తున్నారు.

Related Posts