YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జీవో 27 నుంచి మినహాయించాలి

జీవో 27 నుంచి మినహాయించాలి

జీవో 27 నుంచి మినహాయించాలి
ట్రెసా జగిత్యాల జిల్లా శాఖ.  
జగిత్యాల ఏప్రిల్ 04
కరోనా కట్టడి సేవల్లో,సౌకర్యాలు కల్పనలో  ప్రాణాలను లెక్కచేయకుండా అహర్నిశలు కృషి చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు,అధికారులను జీవో 27 నుంచి మినహాయించాలని తెలంగాణ రెవెన్యూ  ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎం.డీ.వకీల్,గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ లు ప్రభుత్వాన్నీ    కోరుతూ జిల్లా  కలెక్టర్ రవికి  వినతిపత్రం సమర్పించారు. శుక్రవారం వారు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ను కలిసి   తమ రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి పిలుపు మేరకు తమ రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు ప్రాణాలను లెక్క చేయకుండా కరోనా కట్టడి సేవలతో పాటు చేస్తున్న వివిధ సేవలను ప్రస్తావించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు,అధికారులు,ఆర్డీవో,తహశీల్దార్ ల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు వరకు కరోనా కట్టడి లోచేస్తున్న సేవలను అభినందించారు. అంకితభావంతో మీరు చేస్తున్న సేవలను ప్రభుత్వం తప్పక గుర్తిస్తుందన్నారు. రెవెన్యూ ,పోలీసు శాఖలను జీవో 27 నుంచి మినహాయించి నట్లే,రెవెన్యూ శాఖను సైతం మినహాయించాలనే తమ వినతిని ప్రభుత్వానికి పంపించాలని కోరారు.కరోనా వైరస్ ను అరికట్టేందుకు విధినిర్వహణలో ఉన్న వైద్యుల పట్ల అనుచిత0గా ప్రవర్తించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ,వైద్యులు, వైద్య సిబ్బంది కి తమ రాష్ట్ర ట్రెసా అసోసియేషన్ ఆధ్వర్యంలో అండగా ఉంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ సంఘం ప్రధాన కార్యదర్శి చెలుకల కృష్ణ,దిలీప్ నాయక్,a భోగ శశిధర్,జిల్లా కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts