YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏడున సూపర్ మూన్

ఏడున సూపర్ మూన్

ఏడున సూపర్ మూన్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 
మరో రెండు రోజుల్లో సూపర్ మూన్ మనల్ని అలరించనుంది. ఈనెల 7వ తేదీన పున్నమిరోజు కావడంతో చందమామ సూపర్‌మూన్‌గా కనిపించనున్నాడు. చంద్రుడు తన కక్ష్యలో తిరిగే క్రమంలో భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు సాధారణం కంటే 7 శాతం పెద్దగా, 15 ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అందుకే.. ఆ రోజున కనిపించే చందమామను ‘సూపర్‌మూన్‌’ అని పిలుస్తారు. ఉత్తర అమెరికాలాంటి ప్రాంతాల్లో ‘పింక్‌మూన్‌’ అని, ఇతర దేశాల్లో స్ర్పౌటింగ్‌ గ్రాస్‌ మూన్‌, ది ఎగ్‌ మూన్‌, ద ఫిష్‌మూన్‌ అని పిలుస్తుంటారు. కాగా.. భారత్‌లో సూపర్‌మూన్‌ కనిపించకపోవచ్చని.. ఈ సారి చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు భారత్‌లో సమయం 8వ తేదీ ఉదయం 8.05గా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.చంద్ర గ్రహణం, బ్లడ్ మూన్, సూపర్ మూన్.. ఈ మూడూ ఒకేరోజు వస్తే దాన్నే సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దాన్ని బ్లూమూన్ అంటారు. భూమికి దగ్గరగా చంద్రుడు వస్తే దాన్ని సూపర్ మూన్ అంటారు. చందమామ సాధారణం కంటే 7 శాతం పెద్దగా, 15 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తే దాన్ని సూపర్ మూన్‌ అంటారు. 2018 జనవరిలో సూపర్ బ్లడ్ మూన్ వచ్చింది. అప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలామంది దీన్ని చూశారు.ఖగోళ పరంగా సూర్యుడు,భూమి,చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరిగుతుంటాడు. సూర్య,చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే సూర్యుడు,భూమి,చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్దగాని,కేతువు వద్దగాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పూర్తి చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమనీ,కొంత భాగమే కనిపించకపోయేదాన్ని పాక్షిక చంద్రగ్రహణమని అంటారు.ఒక సూపర్ మూన్, చంద్ర గ్రహణం మరియు ఒక బ్లూ మూన్ ఒకేసారి రావటం గత 150 సంవత్సరాలలో సంభవించలేదు. ఫుల్ మూన్ కంటే 14% నుండి 30% ప్రకాశవంతంగా కనిపించే మూన్ ని సూపర్ మూన్ అంటారు. ఇక ఒకే నెలలో రెండు సూపర్ మూన్ లు సంబవిస్తే గనుక దాన్నిబ్లూ మూన్ అంటారు. 2018 జనవరిలో సూపర్ మూన్, చంద్ర గ్రహణం మరియు ఒక బ్లూ మూన్ ఒకేసారి రావడంతో ఆ చంద్ర గ్రహణానికి ప్రత్యేకత ఏర్పడింది. అనేక దేశాల ప్రజలు ఈ అద్భుతాన్ని వీక్షించారు
 

Related Posts