అమెరికాలో 1930 నాటి పరిస్థితి
న్యూయార్క్, ఏప్రిల్ 4
ప్రపంచంలోని అన్ని అదేశాలు కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. దావానంలా వ్యాపించిన ఈ మహమ్మారి సమస్త భూ మండలాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. రోజు రోజూ విజృంభిస్తూ వేలాది మందిని బలితీసుకుంటోంది. ఈ వైరస్‌కు ఇప్పట్లో అడ్డుకట్టపడే సూచనలు కనిపించడంలేదు. అగ్రరాజ్యాలు సైతం మహమ్మారి ప్రభావంతో అతలాకుతలమవుతున్నాయి. అమెరికాలో వైరస్ తీవ్రత మాములుగా లేదు. రోజు రోజుకూ కొత్త కేసులు వేలల్లోనే నిర్ధారణ అవుతుండగా.. మృతుల సంఖ్య కూడా భారీగా ఉంది. 1930 తర్వాత అమెరికా ఇంతటి సంక్షోభాన్ని ఎప్పుడూ చవిచూడలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే ప్రపంచంలోని సగం దేశాలలో లాక్‌డౌన్ అమలవుతోంది. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 59,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 6,000 మంది మృతిచెందారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్ధమవుతోంది. వైరస్ బారినపడ్డవారిలో ఇప్పటి వరకు 229,000 మంది కోలుకున్నారు. మరో 7.70 లక్షల మంది పరిస్థితి నిలకడగా, 39,300 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది.ఐరోపాలోని ఇటలీ, స్పెయిన్‌లో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. టలీలో కరోనా మరణాలు ఆగడం లేదు. ఇటలీ, స్పెయిన్‌లలో రోజుకు వదలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటలీలోనే కోవిడ్ మరణాల సంఖ్య 14,681కు చేరుకోగా.. మరో 700 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. కొత్తగా దాదాపు 3,500 మందిలో వైరస్ నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య 119,8272కి చేరింది. అయితే, ఇటలీలో వైరస్ సంక్రమణ నెమ్మదించినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించడం ఊరట కలిగించే అంశం.అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచంలో అత్యధికంగా 2.77 లక్షల కరోనా పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. శుక్రవారం మరో 32 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ప్రజల పరిస్థితి దయానీయంగా ఉంది. కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 7,392కు చేరుకుంది.న్యూయార్క్‌లో మృతదేహాల ఖననానికీ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. అందులో ‘నెగిటివ్’ వచ్చిందని వైట్‌హౌస్ వైద్యుడు తెలిపారు. ఎదుర్కోవడంలో అమెరికా నాలుగు వారాలు వెనుకబడి ఉందని, ఇప్పటికీ ప్రజలు తీవ్రతను అర్థం చేసుకోలేదని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ పేర్కొంది. నాలుగు వారాల ముందే మేల్కొని కట్టడి చేయగలిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. జపాన్‌లో 10 లక్షల మందికి 20 కేసులే నమోదవుతున్నాయి.న్యూయార్క్‌లో వచ్చే కేసులన్నీ పాజిటివ్‌వే ఉంటున్నాయి. పరీక్షలు చేయడం కష్టంగా ఉందని సిబ్బంది వాపోతున్నారు. ఇంకా 1.65 లక్షల నమూనాలు పరీక్షల కోసం ల్యాబ్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఈ రాష్ట్రంలో మూడు రోజుల్లో వరుసగా 24 వేలు, 26 వేలు, 29 వేలు.. ఇలా రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలో దాదాపు 2,800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ పరీక్షలను దాదాపు 1.5 మిలియన్ల మందికి నిర్వహించారు.. స్పెయిన్‌లో 900 మందికిపైగా మృత్యువాతపడ్డారు. బ్రిటన్‌లో ఒక్కరోజులోనే 569 మంది చనిపోయిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం 4వేల పడకల ఫీల్డ్ ఆసుపత్రిని ప్రారంభించింది. జర్మనీలో కొత్త ఇన్‌ఫెక్షన్ల రేటు తగ్గింది. దేశంలో మరోసారి ఈ వైరస్ కేసుల సంఖ్య పెరగకుండా చూసేందుకు పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయాలని సింగపూర్ నిర్ణయించింది.