YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

ఎన్నికల కోసం... రష్యా అంత చేస్తోందా...

ఎన్నికల కోసం... రష్యా అంత చేస్తోందా...

ఎన్నికల కోసం... రష్యా అంత చేస్తోందా...
మాస్కో, ఏప్రిల్ 4 
రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశాంతంగా ఉన్నాడు. కరోనా వైరస్ తమ దేశంలో లేదని చెబుతున్నారు. రష్యాను కరోనా వైరస్ తాకదని ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. అది నిజమేనా? లేక త్వరలో జరగనున్న ఓటింగ్ కోసమేనా? అన్న చర్చ జరుగుతోంది. నిజానికి రష్యాలో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసలు వేయికి మించలేదు. అలాగే నలుగురు మాత్రమే మరణించారని రష్యా అధికారికంగా ప్రకటించింది. పుతిన్ నాటకాలాడుతున్నాడా? వాస్తవంగా రష్యాలో కరోనా కంట్రోల్ లో ఉందా? అన్నది అంతర్జాతీయ సమాజంలో చర్చనీయాంశమైంది.నిజానికి చైనా సరిహద్దు దేశం రష్యా. చైనా మరో సరిహద్దు దేశమైన దక్షిణ కొరియాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కానీ రష్యాకు 2600 కిలోమీటర్ల చైనా సరిహద్దు ప్రాంతం ఉంది. పక్కనే ఉన్న చైనా నుంచి రష్యాకు మాత్రం కరోనా వైరస్ బెడద తక్కువగానే ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే రష్యా వేయిమంది మాత్రమే తమదేశంలో కరోనా వైరస్ బారిన పడ్డారని, అందులో నలుగురు మాత్రమే చనిపోయారని రష్యా చెబుతున్న లెక్కల్లో నిజానిజాలెంత? అన్న దానిపై సందేహాలున్నాయి.చైనాకు ఆవల ఉన్న అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతుంది. లక్షలాది మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కానీ పక్కనే ఉన్న రష్యాలో మాత్రం కరోనా వైరస్ ప్రభావం పెద్దా లేదు. ఈ ఏడాది జనవరిలోనే కరోనా వైరస్ ను రష్యా గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో జనవరి 30వ తేదీన చైనా సరిహద్దులను రష్యా మూసివేసింది. అంతర్జాతీయంగా రాకపోకలపై నిషేధం విధించింది. అంతర్జాతీయ విమానాశ్రాయాలను రద్దు చేయకపోయినా ఎయిర్ పోర్టు లో థర్మల్ స్క్రీనింగ్ ద్వారా పరీక్షలు నిర్వహించింది.ఫిబ్రవరి మొదటి వారం నుంచే రష్యాలో పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ చెబుతున్నారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పాక్షిక ఆంక్షలు విధించారు. నిత్యావసర వస్తువులు మినహా అన్ని బంద్ చేశారు. చర్చిల్లో సామూహిక ప్రార్థనలను నిషేధించారు. భౌతిక దూరం పాటించాలని చేసిన ప్రచారాన్ని రష్యా ప్రజలు పాటించారు. అందుకే కరోనా వైరస్ తమ దేశంపై అంత ప్రభావం చూపలేదని పుతిన్ చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ విషయంలో పుతిన్ అబద్ధాలు చెబుతున్నారని కూడా ప్రచారం ఉంది. పుతిన్ మరో 12 ఏళ్ల పాటు పదవిలో కొనసాగడానికి చేసిన రాజ్యాంగ సవరణపై ఏప్రిల్ 22వ తేదీన దేశ వ్యాప్తంగా ఓటింగ్ జరగనుంది. దీనికోసమే పుతిన్ కరోనా ప్రభావాన్ని బయటపెట్టడం లేదని కూడా అంటున్నారు. మొత్తం మీద చైనా సరిహద్దు దేశమైన రష్యాలో అధికారిక లెక్కల ప్రకారం అక్కడ కరోనా పెద్దగా ప్రభావం చూపనట్లే.

Related Posts