YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

వైన్ షాపు లూటీ

వైన్ షాపు లూటీ

వైన్ షాపు లూటీ
హైద్రాబాద్, ఏప్రిల్ 4
లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఓ వైపు తాగడానికి మందు దొరక్క మందుబాబులు పిచ్చెక్కి పోతుంటే.. కొందరు మాత్రం ఇదే అదునుగా చోరీలకు పాల్పడుతున్నారు. మద్యం దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడి మందు బాటిళ్లను, డబ్బును ఎత్తుకెళ్తున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వైన్స్ షాపు‌లో దొంగతనం జరిగింది.షాప్ పై భాగంలో ఉండే రేకును కత్తిరించి షాపులోకి దూరిన దొంగ.. రూ.3 లక్షల విలువైన మద్యం బాటిళ్లను లూటీ చేశాడు. గల్లా పెట్టెలో ఉన్న డబ్బును కూడా ఎత్తుకెళ్లాడు. షాప్‌లో ఉన్న సీసీటీవీలో ఈ దొంగతనం రికార్డ్ అయ్యింది. వీడియో ఫుటేజీ ఆధారంగా పోలీసులు దొంగను పట్టుకునే పనిలో పడ్డారు.కర్ణాటకలోనూ ఇదే తరహాలో చోరీ జరిగింది. మంగళూరు సమీపంలోని ఉల్లాల్ పట్టణంలో లిక్కర్ షాప్‌‌లోకి ప్రవేశించిన దొంగలు.. లక్ష రూపాయల విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. పనిలో పనిగా డిజిటల్ వీడియో రికార్డర్‌ను కూడా ఎత్తుకెళ్లారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Related Posts